మెగా ఫాన్స్ ఎదురు చూసిన క్షణం వచ్చేసింది. ఆచార్య టీజర్ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఫాన్స్ కి కొరటాల శివ ట్రీట్ ఇచ్చేసాడు. చిరు - చరణ్ కాంబోలో బిగ్గెస్ట్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా.. రామ్ చరణ్ పాత్రకి పూజ హెగ్డే ఎంపికైంది. తాజాగా విడుదలైన టీజర్ లో రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో చిరంజీవి యాక్షన్ ఇరగదీసేసాడు. ధర్మస్థలి నేపథ్యంలో సాగే కథ ఇది. ఆ ప్రాంతంలో ఓ గుడి. అక్కడి ప్రజల ఇబ్బందులు.. వాటిని పాలద్రోలడానికి వచ్చిన ఆచార్య చిరు. రామ్ చరణ్ వాయిస్ ఓవర్ తో ఆచార్య టీజర్ నడిచింది.
ఇతరకుల కోసం జీవించే వాళ్లు దైవంతో సమానం. అలాంటి వారి జీవితాలే ప్రమాదంలో పడితే.. ఆ దైవమే వచ్చి కాపాడాల్సిన పనిలేదు అంటూ రామ్ చరణ్ వాయిస్ బ్యాగ్రౌండ్ లో వినిపిస్తుంటే.. యాక్షన్ తో శత్రువులని చితగ్గొట్టిన ఆచార్య గా చిరు యాక్షన్ సూపర్బ్ అనేలా ఉంది. పాఠాలు చెప్పే అలవాటు లేకపోయినా అందరూ ఎందుకో ఆచార్య అంటుంటారు. బహుశా.. గుణ పాఠాలు చెబుతాననేమో..అనే బరి పవర్ ఫుల్ డైలాగ్ తో టీజర్ ఎండ్ అయ్యింది. ఆచార్య టీజర్ మొత్తం చిరు పవర్ ఫుల్ పెరఫార్మెన్స్, అలాగే భారీ యాక్షన్ సీక్వెన్స్ ఉండేలా ప్లాన్ చేసారు. చిరు ఆచార్య లుక్స్ మాస్ అభిమానులకు ఎక్కేస్తాయి. ఇక మణిశర్మ నేపధ్య సంగీతం హైలెట్ అనేలా ఉంది. మణిశర్మ సంగీతం, కొరటాల మార్క్ మేకింగ్ తో ఆచార్య టీజర్ మెగా ఫాన్స్ కి కిక్కిచ్చేదిలా ఉంది. మరి ఈ వేసవి బరిలో ఆచార్య అందరిని ఒణికించడం ఖాయమగానే కనబడుతుంది.