Advertisementt

మెగా ఫాన్స్ కి రెండు ట్రీట్స్

Fri 29th Jan 2021 05:42 PM
chiranjeevi,acharya movie,ram charan,acharya movie date locked,acharya release date,may 13th,koratala shiva,kajal,pooja hegde  మెగా ఫాన్స్ కి రెండు ట్రీట్స్
Acharya release date locked మెగా ఫాన్స్ కి రెండు ట్రీట్స్
Advertisement
Ads by CJ

ఆచార్య టీజర్ అంటూ గత రెండు రోజులుగా సోషల్ మీడియాలో మెగా ఫాన్స్ రచ్చ రచ్చ చేస్తున్న విషయం తెలిసిందే. కొరటాలని చిరు బెదిరించి టీజర్ అప్ డేట్ ఇప్పించడమే కాదు.. టైం ఫిక్స్ చేసి టీజర్ ని జనవరి 29 న రిలీస్ చేసి దుమ్ములేపారు. రామ్ చరణ్ వాయిస్ తో చిరు యాక్షన్ తో ఆచార్య టీజర్ అదిరిపోయింది. ఒక్క టీజర్ అప్ డేట్ తోనే మెగా ఫాన్స్ పండగ చేసుకుంటుంటే.. అంతలోనే సాయంత్రం 5.30 నిమిషాలకు ఆచార్య రిలీజ్ అనౌన్సమెంట్ అంటూ మరో బిగ్ అప్ డేట్ ఇచ్చేసింది ఆచార్య టీం. రెండు రోజుల నుండి సినిమాల విడుదల డేట్స్ జాతరలో ఆచార్య కూడా జాయిన్ అయ్యింది.

సమ్మర్ రిలీజ్ అంటూ ఆచార్య రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసింది టీం. మే 13 న ఆచార్య గ్రాండ్ రిలీజ్ అంటూ డేట్ లాక్ చేసింది టీం. మాస్ గా చిరు పోస్టర్ తో సహా ఆచార్య రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసింది. మరి మే 13 న థియేటర్స్ లో రామ్ చరణ్ - చిరు కలిసి అదరగొట్టెయ్యడం ఖాయం అంటూ మెగా ఫాన్స్ ఫిక్స్ అవుతున్నారు.ఆచార్య టీజర్‌ బ్యాక్‌గ్రౌండ్‌లో ఆచార్య దేవోభవ.. ఆచార్య రక్షోభవ అనే స్లోగన్‌ వినిపిస్తుంది. మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన నేపథ్య సంగీతం పెద్ద ఎసెట్‌గా నిలుస్తోంది. 

ప్రస్తుతం ఆచార్య సినిమా చిత్రీకరణ దశలో ఉంది. ఈ సినిమా కోసం హైదరాబాద్‌ శివారు ప్రాంతమైన కోకాపేటలో వేసిన భారీ టెంపుల్‌ సెట్‌ను ఈ టీజర్‌లో మనం చూడొచ్చు. ఇండియాలో అతి పెద్ద భారీ టెంపుల్‌ సెట్‌ ఇది. 

Acharya release date locked:

Acharya releasing on may 13th

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ