ఆహా అనే ముంబైల్ యాప్ స్టార్ట్ చేసాక అత్యధిక మొత్తం వెచ్చించి కొన్న సినిమా రవితేజ క్రాక్. ఏకంగా 10 కోట్లు పెట్టి కొన్న సినిమా క్రాక్. అయితే ముందు డిజిటల్ ఒప్పందం మేరకు జనవరి 9 న విడుదలైన క్రాక్ సినిమాని జనవరి 29 న ఆహాలో స్ట్రీమింగ్ కి పెట్టేసుకోవాలి. అయితే మిగతా సంక్రాంతి సినిమాలన్నీ నీరసంగా ఉండడంతో క్రాక్ సినిమాకి ఇంకా థియేట్రికల్ రెవిన్యూ వస్తుండడంతో షేర్ లో ఉన్న సినిమాని అప్పుడే స్ట్రీమింగ్ లో పెట్టడం కరెక్ట్ కాదు అంటూ ఆపారు. జనవరి 29 నుండి ఫిబ్రవరి 5th కి పోస్ట్ పోన్ చేయించారు. మాములుగా అయితే ఫిబ్రవరి 5th నే ఆహా లో క్రాక్ స్ట్రీమింగ్ అవ్వాలి.
ఇప్పటికి షేర్స్ లో రన్ అవుతున్న సినిమాని ఫిబ్రవరి 5 నుండి మరో వారం వాయిదా వెయ్యమంటూ రిక్వెస్ట్ లు అటు ప్రొడక్షన్ సైడ్ నుండి ఇటు డిస్ట్రిబ్యూషన్ సైడ్ నుండి, విచిత్రం ఏమిటి అంటే రవితేజ ఫాన్స్ సైడ్ నుండి కూడా గీత ఆర్ట్స్ కి రిక్వెస్ట్ లు వెళుతున్నాయి. మరో వారం క్రాక్ సినిమాని థియేటర్స్ లో ఉంచండి అని. మరి పెద్ద మొత్తానికి డిజిటల్ రైట్స్ తీసుకున్న ఆహా ఏం చేస్తుందో.. ఇంకో వన్ వీక్ ఛాన్స్ ఇచ్చి.. ఆహా అనిపించుకుంటుందా? లేదు తాము పెట్టిన పెట్టుబడి స్వాహా చెయ్యాలి కాబట్టి ఆన్ లైన్ స్ట్రీమింగ్ లోకి దింపేస్తుందా? జస్ట్ వెయిట్ అండ్ సి.