Advertisementt

సమంతకి షాకిచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2

Sun 31st Jan 2021 10:38 AM
samantha,family man 2,web series,manoj bajpai,family man 2 postponed  సమంతకి షాకిచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2
Family Man Season 2 gets postponed? సమంతకి షాకిచ్చిన ఫ్యామిలీ మ్యాన్ 2
Advertisement
Ads by CJ

క్రేజీ హీరోయిన్ సమంత పాన్ ఇండియా లెవల్లో చేసిన ఫ్యామిలీ మ్యాన్ 2 కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. గత ఏడాదే అమెజాన్ ప్రైమ్ లో విడుదల కావాల్సిన ఫ్యామిలీ మ్యాన్ 2 కరోనా కారణంగా వాయిదా పడింది. అయితే ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 1 అద్భుత విజయం సాధించడంతో ఫ్యామిలీ మ్యాన్ 2 మీద అందరిలో క్యూరియాసిటీతో పాటే అంచనాలు ఉన్నాయి. కారణం సౌత్ ఇండియన్ హీరోయిన్ సమంత నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్ చెయ్యడంతో సౌత్ లోని ఆ వెబ్ సీరీస్ పై అందరిలో పిచ్చ ఆసక్తి ఏర్పడింది. అందులోను సమంత ఫ్యామిలీ మ్యాన్ గురించి గొప్పగా చెప్పడం, ఆ కేరెక్టర్ తన కెరీర్ లోనే అత్యుత్తమైనదిగా వర్ణించడంతో సమంత నటించిన ఫ్యామిలీ మ్యాన్ రాక కోసం అందరూ ఎదురు చూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం ఫ్యామిలీ మ్యాన్ సీజన్ 2 ఫిబ్రవరి 12 రిలీజ్ లేదని.. కొన్ని కారణాల వలన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ పోస్ట్ పోన్ అయ్యింది అనే న్యూస్ స్టార్ట్ అయ్యింది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ విషయంలో పోస్ట్ పోన్ మీద పోస్ట్ పోన్ చేస్తున్న టీం ఇప్పుడు సీరీస్ విడుదల కూడా వాయిదా వెయ్యబోతున్నట్టుగా టాక్. సమంత ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ కోసం అందరూ ఇంట్రెస్ట్ గా ఎదురు చూస్తున్న సమయంలో ఈ వెబ్ సీరీస్ పోస్ట్ పోన్ అయ్యింది అంటూ వస్తున్న వార్తలతో సామ్ అభిమానులు నిరాశలో కూరుకుపోయారు. మరి ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్ తో పాన్ ఇండియాలో గ్రాండ్ గా ఎంట్రీ ఇద్దామనుకున్న సమంత కి ట్రైలర్ రిలీజ్ చెయ్యకుండా షాకిచ్చి.. ఇప్పుడు మళ్ళీ పోస్ట్ పోన్ అంటూ మరో షాకివ్వబోతుంది ఈ ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సీరీస్.

Family Man Season 2 gets postponed?:

Samantha Family Man Season 2 gets postponed?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ