ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కుతున్న సలార్ సినిమా అధికారికంగా మొదలు కావడమే కాదు.. ఆఫీషియల్ గా సెట్స్ మీదకి కూడా వెళ్ళిపోయింది. గత శుక్రవారమే రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టిన సలార్ ప్రస్తుతం రామగుండం సింగరేణి బొగ్గు గనుల్లో ప్రత్యేకంగా వేసిన సెట్ లో చిత్రీకరణ జరుగుపుకుంటుంది. ఇప్పటికే ప్రభాస్ రామగుండం వెళ్లి అక్కడ పోలీస్ అధికారులను కలవడం.. ఆఫీషియల్ గా షూటింగ్ లొకేషన్ కి వెళ్లడం జరిగింది. అయితే సలార్ షూటింగ్ సార్టింగ్ లోనే భారీ యాక్షన్ సన్నివేశాలతో స్టార్ట్ అయ్యింది. సలార్ లో ప్రభాస్ ఎంట్రీ ఈ భారీ సన్నివేశంతోనే ఉండబోతుందట. సలార్ లో ప్రభాస్ ఎంట్రీ మాములుగా ఉండదని చెబుతుంది టీం.
అయితే ప్రస్తుతం సింగరేణి బొగ్గు గనుల్లో ప్రభాస్ తో పాటుగా 600 మంది జూనియర్ ఆర్టిస్ట్ లు పాల్గొంటున్నారు. ఈ భారీ యాక్షన్ సన్నివేశం కోసం ప్రశాంత్ నీల్ ఇప్పటికే ఆడిషన్స్ చేసి 600 మందిని సెలెక్ట్ చేసుకుని ఉండడంతో ఇప్పుడు ఆ భారీ జనం సలార్ షూటింగ్ లో పాల్గొంటున్నారట. అంతేకాకుండా 1200 షూస్, లక్షా యాభై వేల మాస్క్ లతో సలార్ షూటింగ్ ని గ్రాండ్ గా ప్రారంభించిందట సలార్ టీం. అన్నీ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసుకునే షూటింగ్ మొదలు పెట్టినట్టుగా తెలుస్తుంది. ఫిబ్రవరి 10 వరకు సలార్ షూటింగ్ సింగరేణికి బొగ్గు గనుల్లో జరగబోతుంది. ఇక తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ కోసం, ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ 2 కోసం వెళ్ళిపోతారట.