ద్వారకా క్రియేషన్స్ బేనర్‌లో అత్యంత ప్రెస్టీజియస్‌గా, భారీ తారాగణంతో తెరకెక్కుతున్న బాలకృష్ణ - బోయపాటి కాంబో.. ఎప్పుడెప్పుడు ఫస్ట్ లుక్ విడుదల చేస్తారా ? ఎప్పుడెప్పుడు టైటిల్ ఇస్తారా? అందరూ రిలీజ్ డేట్స్ ఇచ్చేసినా BB3 రిలీజ్ డేట్ ఎక్కడా? అంటూ బాలయ్య అభిమానులు ఎదురు చూపులకి బోయపాటి క్లారిటీ చేసాడు. బాలకృష్ణ - బోయపాటి BB3 కి టైటిల్ ఎనౌన్సమెంట్ లేకుండానే రిలీజ్ డేట్ ఇచ్చేసారు. అంటే గత మూడు రోజులుగా జరుగుతున్న రిలీజ్ డేట్ జాతరలో బాలయ్య - బోయపాటి కూడా జాయిన్ అయిపోయారు. అంటే నలుగురితో నారాయణ అంటూ స్పెషల్ ఏమి లేకుండానే బోయపాటి - బాలయ్య BB3 లుక్ తో రిలీజ్ డేట్ ఇచ్చేసాడు. సీనియర్ హీరోలైన చిరు - వెంకీ లు మే 13 న ఆచార్య, మే 14 నారప్ప సినిమాలను రిలీజ్ చేస్తున్నారు.
ఇప్పుడు బాలయ్య కూడా అదే నెలలో అంటే మే 28 ఎన్టీఆర్ జయంతి రోజున థియేటర్స్ లో దిగబోతున్నాడు. మే 28 న అధికారికంగా BB3 డేట్ రిలీజ్ ప్రకటించింది టీం. మరి ఇన్నాళ్లు ఎలాంటి అప్ డేట్ లేకుండా ఫాన్స్ ని ఉస్సురుమనిపిస్తూ సైలెంట్ గా షూటింగ్ చేసుకుంటున్న BB3 రిలీజ్ అప్ డేట్ కోసం వెయిట్ చేసారు. అలాగే టైటిల్ విషయంలో సోషల్ మీడియాలో రకరకాల పేర్లు చక్కర్లు కొడుతున్నాయి. BB3 టైటిల్ మోనార్క్ అంటూ చాలామంది అభిమానులు ఫిక్స్ అయ్యారు కూడా. కానీ ఇప్పుడు టైటిల్ తో పాటు రిలీజ్ డేట్ ఇస్తే అదిరిపోయేది.. కానీ అందరిలాగే రిలీజ్ డేట్ ఇచ్చేసి టైటిల్ దాచేసారు అంటూ అభిమానులు ఫీలైపోతున్నారు. ఫిబ్రవరి సెకండ్ వీక్ నుండి ఫైనల్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌తో షూటింగ్ పూర్తవుతుంది.. అంటూ టీం అప్ డేట్ ఇచ్చేసింది.