బిగ్ బాస్ సీజన్4 లో గ్లామర్ హీరోయిన్ గా అడుగుపెట్టి.. బిగ్ బాస్ సీజన్ చివరి వరకు హౌస్ లోనే ఉన్న మోనాల్ అందాలను బుల్లితెర మీదే కాదు.. బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక వెండితెర మీద కూడా జిగేల్ మంటున్నాయి. బిగ్ బాస్ లో అఖిల్ అండ్ గ్లామర్ తో బాగా పాపులర్ అయిన మోనాల్ గజ్జర్.. హౌస్ నుండి బయటికి వచ్చాక డాన్స్ ప్లస్ డాన్స్ షో తో పాపులర్ అవుతుండగా.. వెండితెర మీద బెల్లంకొండ బాబుతో అల్లుడు అదుర్స్ సినిమాలో చేసిన స్పెషల్ ఐటెం సాంగ్ తో మోనాల్ బాగా పాపులర్ అయ్యింది. మరో పక్క బాలీవూడ్ లోను మోనాల్ సక్సెస్ స్టార్ట్ అయ్యింది.
తాజాగా మోనాల్ మహేష్ బాబు సర్కారు వారి పాటలో ఐటెం సాంగ్ చేయబోతుంది అనే టాక్ స్టార్ట్ అయ్యింది. ఈమధ్యనే పరశురామ్ అండ్ మహేష్ లు దుబాయ్ లో సర్కారు వారి పాట షూటింగ్ స్టార్ట్ చెయ్యడం, రిలీజ్ డేట్ ఇవ్వడం వెంట వెంటనే జరిగిపోయాయి. అయితే సర్కారు వారి పాటలో మహేష్ పక్కన మాస్ స్టెప్స్ తో బాలీవుడ్ భామ ఊర్వశి రౌతేల్ల ఉర్రుతలూగించనుంది అనే ప్రచారం బాగా జరిగింది. కానీ తాజాగా మహేష్ సర్కారు వారి పాట ఐటెం కోసం మోనాల్ ని తీసుకోబోతున్నారని అంటున్నారు. ఈ న్యూస్ లో నిజం ఎంతుందో కానీ.. మోనాల్ మహెష్ మూవీలో ఐటెం సాంగ్ అనగానే ఇప్పడు మోనాల్ రేంజ్ మాత్రం బాగా పెరిగిపోయింది.