సినిమాల కథలు ఎంపికలో కానీ, సినిమాల డిస్కర్షన్స్ లో కానీ, టెక్నీషియన్స్ ఎంపికలోనూ ప్రతి దానిలోనూ చిరంజీవి చాలా ఆచి తూచి వ్యవహరిస్తారనే విషయం అందరికి తెలిసిందే. తన సినిమాలకే కాదు.. తన కాంపౌండ్ లోని హీరోలందరి విషయంలోనూ చిరు ఇన్వాల్మెంట్ ఉంటుంది. ఈ విషయం అందరికి తెలిసిందే. మగధీర తర్వాత ఆరెంజ్ వంటి అట్టర్ ప్లాప్ మూవీ చవి చూసిన రామ్ చరణ్ కి ఇది కాదు చెయ్యాల్సిన సినిమా.. అని మాస్ చిత్రం రచ్చ ని సజెస్ట్ చేసిన చిరంజీవి.. దగ్గరుండి మరీ ఎడిట్ చేయించి ఒక కమర్షియల్ సక్సెస్ ని రామ్ చరణ్ ఖాతాలో వేశారు.
అలాగే చాలా సినిమాల విషయంలో చిరు ఇన్వల్వెమెంట్ ఉంటుంది. అసలు మెగా హీరోలందరి సినిమాల విషయంలో చిరంజీవి ఇన్వాల్మెంట్ ఉంటుంది అనేది అందరికి తెలిసిన విషయమే. తన ముద్దుల మేనల్లుడు, చిన్న మేనల్లుడు తనతో శంకర్ దాదా సినిమాలో నటించిన వైష్ణవ తేజ్ అంటే చిరుకి ప్రత్యేకమైన ఇష్టం. వైష్ణవ తేజ్ నటించిన మొదటి సినిమా ఉప్పెన సినిమాని రీసెంట్ గా చూసిన చిరంజీవి సినిమా విషయంలో తన సంతృప్తిని వ్యక్తం చేసారు. అయితే లెంత్ విషయంలో మాత్రం కొన్ని కరెక్షన్స్ చెప్పి ట్రిమ్మింగ్ కి కొన్ని సలహాలు ఇచ్చారట చిరు.
మరి మెగా సలహాలు ఈసారి కూడా వర్కౌట్ అయ్యి ఆ సినిమాని సక్సెస్ ట్రాక్ లో పెడతాయా.. వైష్ణవ్ తేజ్ కి ఉప్పెన తో మంచి బ్రేక్ దొరుకుంతుందా? వెయిట్ అండ్ సీ.