అగ్ర కథానాయకుడైన బాలకృష్ణ సంక్రాంతి సీజన్ లో ఎన్ని సూపర్ హిట్స్ కొట్టాడో.. ఎప్పటికప్పుడు అన్ని సీజన్స్ లో బాలయ్య హిట్స్ ఎన్నున్నాయో ఇండస్ట్రీ మొత్తానికి తెలుసు. ఇటు తన సమకాలికులైన వెంకటేష్, చిరంజీవి, నాగార్జున లతో పోటీ పడుతూ కూడా సినిమాలు రిలీజ్ చేసి హిట్స్ కొట్టిన ట్రాక్ రికార్డు ఉంది బాలకృష్ణ కి. అయితే ఒకే ఒక్క హీరోతో మాత్రం కాంపిటీషన్ కి వెళ్లిన ప్రతిసారి తలవంచాల్సి వచ్చింది. అది కాకతాళీయమో..అప్పటికి ఆ వచ్చిన సినిమాల అవుట్ ఫుట్ అలా ఉండడం వలనో.. అలాంటి రిజల్ట్ ఫేస్ చెయ్యాల్సి వచ్చింది. ఆ హీరో ఎవరంటే రవితేజ. ఒకసారి మిరపకాయ్ - పరమ వీర చక్ర. ఒకసారి కృష్ణ - ఒక్కమగాడు, ఒకసారి కిక్ - మిత్రుడు. మిత్రుడు మీద కిక్ అప్పర్ హ్యాండ్ సాధించింది. అలాగే ఒక్క మగడు మీద కృష్ణ అప్పర్ హ్యాండ్, అలానే పరమ వీర చక్ర మీద మిరపకాయ్ అప్పర్ హ్యాండ్ సాధించాయి. మూడుసార్లు రవితేజ హవానే కొనసాగింది.
మళ్ళీ మరోసారి బాలకృష్ణ - రవితేజ బాక్సాఫీసు దగ్గర తలపడబోతున్నారు. బాలకృష్ణ - బోయపాటి BB3 - రవితేజ ఖిలాడీ సినిమాలు రెండూ మే 28 నే నువ్వా - నేనా అంటూ తలపడడానికి రిలీజ్ డేట్స్ ఫిక్స్ చేసాయి. అయితే ఈసారి బాలయ్యకి తనకి కలిసొచ్చిన దర్శకుడు బోయపాటి ఉన్నాడు. బ్యాక్ టు బ్యాక్ రెండు బిగ్గెస్ట్ హిట్స్ కొట్టిన కాంబినేషన్ బాలయ్య- బోయపాటిది. దానికి మించి తన తండ్రి స్వర్గీయ ఎన్టీఆర్ బర్త్ డే రోజున బాక్సాఫీసు బరిలోకి దిగి జూలు విదిల్చబోతున్నాడు నటసింహం బాలయ్య బాబు. ఈసారి బాలయ్య, రవితేజతో ఉన్న ఆ బ్యాడ్ రికార్డుని బ్రేక్ చేసి BB3 తో తన సత్తా చూపిస్తాడని బాలయ్య అభిమానులు నమ్ముతున్నారు. లెజెంట్, సింహ చిత్రాలతో మాస్ ని ఓ ఊపు ఊపిన బాలయ్య - బోయపాటి కాంబో ఈసారి కూడా అంతటి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రవితేజకి చుక్కలు చూపించడం ఖాయం అంటున్నారు నందమూరి ఫాన్స్.