Advertisementt

ప్రభాస్ ఆదిపురుష్ ఆరంభం

Tue 02nd Feb 2021 09:30 AM
prabhas,om raut,adipurush movie,adipurush pan india film,adipurush movie shooting begins  ప్రభాస్ ఆదిపురుష్ ఆరంభం
Adipurush Shooting Begins ప్రభాస్ ఆదిపురుష్ ఆరంభం
Advertisement
Ads by CJ

ప్రభాస్ పాన్ ఇండియా జోరు చూస్తుంటే.. ఈసారి ప్రభాస్ ఫాన్స్ కి ఊపిరి తీసుకోలేనన్ని సెలెబ్రేషన్స్ ఖాయంలాగే అనిపిస్తుంది. రాధేశ్యామ్ రిలీజ్ డేట్ జాడ లేదు.. ఈలోపే ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో సలార్ సెట్స్ మీదకెళ్ళిపోయాడు. ప్రస్తుతం సింగరేణి బొగ్గు గనుల్లో సలార్ కి సంబందించిన భారీ యాక్షన్ సీక్వెన్స్ ని తెరకెక్కిస్తున్నాడు ప్రశాంత్ నీల్. ఇక ఫిబ్రవరి 10 వరకు జరగనున్న సలార్ షూటింగ్ నుండి ఇప్పుడు ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఆదిపురుష్ కి జంప్ అవ్వాల్సిన సమయం ఆసన్నమైంది. ఎందుకంటే ఈ రోజే అధికారికంగా ప్రభాస్ - ఓం రౌత్ కాంబో ఆదిపురుష్ ఆరంభమైంది.

భారీ అంచనాలు మధ్యన అనౌన్స్ చేసిన ఆదిపురుష్ ప్రాజెక్ట్ ని ఓం రౌత్ మొదలు పెట్టేసాడు. ఇప్పటికే విలన్ గా సైఫ్ అలీ ఖాన్ ని సెట్ చేసుకున్న ఓం రౌత్ తన టీం తో ఆదిపురుష్ ఆరంభానికి రంగం సిద్ధం చెయ్యడమే కాదు.. అధికారికంగా మొదలు పెట్టేసి ప్రభాస్ ఫాన్స్ కి ఉత్సాహాన్ని ఇచ్చేసాడు. మరి ప్రభాస్ సలార్ అండ్ ఆదిపురుష్ అండ్ నాగ్ అశ్విన్ సినిమాలకు పక్కాగా డేట్స్ కేటాయించుకుని ఎక్కడా ఇబ్బంది లేకుండా సెట్ చేసుకోవడంతో ప్రభాస్ దర్శకులు ఒక్కొక్కరిగా రంగంలోకి దిగేస్తున్నారు. ఆదిపురుష్ సీత వేటలోనే ఉన్న ఓం రౌత్ ఆదిపురుష్ కోసం డ్రీం గర్ల్ హేమమాలిని ని తీసుకోబోతున్నాడనే న్యూస్ ఉంది. 

Adipurush Shooting Begins:

Prabhas - Om Raut Adipurush Shooting Begins