Advertisementt

ఆదిపురుష్ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం

Tue 02nd Feb 2021 08:11 PM
adipurush,prabhas,om raut,fire accident,adipurush sets  ఆదిపురుష్ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం
Fire accident on sets of Prabhas Adipurush ఆదిపురుష్ సెట్స్ లో భారీ అగ్ని ప్రమాదం
Advertisement
Ads by CJ

ప్రభాస్ - ఓం రౌత్ కాంబోలో భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఆదిపురుష్ పాన్ ఇండియా ఫిలిం ఈ రోజే అంటే ఫిబ్రవరి 2 వ తేదీన గ్రాండ్ గా ముంబై లో లాంచ్ అయ్యింది. ప్రభాస్ - ఓం రౌత్ పాల్గొన్న పూజ కార్యక్రమాల ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. విలన్ గా రావణ్ పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించబోతున్న ఆదిపురుష్ సినిమా కోసం ఇప్పటికే ఓం రౌత్ భారీ సెట్స్ నిర్మాణం చేపట్టాడు. ప్రస్తుతం ఆ సెట్స్ లోనే ఆదిపురుష్ షూటింగ్ చిత్రకరణకు ప్లాన్ చేసుకున్నాడు దర్శకుడు. ప్రస్తుతం సలార్ రెగ్యులర్ షూటింగ్ కోసం సింగరేణిలో ప్రశాంత్ నీల్ డైరేక్షన్ లో చిత్రకారణలో పాల్గొంటున్న ప్రభాస్ ఈ నెల 10 కల్లా ఆదిపురుష్ సెట్స్ మీదకొచ్చేస్తాడు.

అయితే అంత గ్రాండ్ గా ఓపెనింగ్ జరుపుకున్న ఆదిపురుష్ సెట్స్ లో భారీ అగ్నిప్రమాదం జరగడం అందరిని షాక్ కి గురి చేసింది. అక్కడ మంటలు ఎలా అంటుకున్నాయి తెలియదు కానీ.. ఆదిపురుష్ సెట్స్ లో జరిగిన భారీ అగ్ని ప్రమాదం వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సెట్ తగలబడిపోతున్న విజువల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఆదిపురుష్ సెట్ లో జరిగిన ఈ అగ్నిప్రమాదంలో ఎవరికీ అంటే ఆదిపురుష్ యూనిట్ సభ్యులకెవరికి ఎలాంటి ప్రమాదం జరగలేదని.. అందరూ సేఫ్ గానే ఉన్నారని.. కాకపోతే సెట్ మాత్రం పూర్తిగా దగ్దమైనట్లుగా ఆ వీడియో చూస్తే తెలుస్తుంది. ప్రమాదం జరిగిన సమయంలో ప్రభాస్ కానీ, దర్శకుడి ఓం కానీ, సైఫ్ అలీ ఖాన్ కానీ అక్కడ లేకపోవడంతో ఫాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు కాకపోతే. భారీ బడ్జెట్ తో భారీ క్రేజ్ తో భారీగా మొదలైన ఆదిపురుష్ సినిమా సెట్ లో మొదటి రోజే ఇలాంటి అగ్నిప్రమాదం జరగడంతో ప్రభాస్ ఫాన్స్ తెగ ఫీలైపోతున్నారు. అయితే అక్కడ యూనిట్ సభ్యులెవరికీ ఏమి కాలేదని తెలిసి ఊపిరి పీల్చుకుంటున్నారు.

Fire accident on sets of Prabhas Adipurush :

Fire accident On Prabhas Adipurush Sets

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ