రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ - తారక్ కాంబోలో తయారవుతున్న ఆర్. ఆర్. ఆర్ సినిమా కోసం ఫాన్స్, ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురు చూస్తున్నారు. కరోనా క్రైసిస్ కనక లేకపోతే ఈపాటికి ఆర్. ఆర్. ఆర్ ప్రేక్షకుల ముందు ఉండేది. ఇక రీసెంట్ రిలీజ్ డేట్ ఇవ్వడంరో ఆర్. ఆర్. ఆర్ పై అంచనాలు తారాస్థాయికి చేరుకున్నాయి. రామరాజుగా రామ్ చరణ్, కొమరం భీం గా తారక్ ల వీడియోస్ ప్రేక్షకులను, ఫాన్స్ ని విశేషంగా ఆకట్టుకున్నాయి. ఆర్. ఆర్. ఆర్ రాక కోసం ప్రేక్షకులు ఎంతెలా ఎదురు చూస్తున్నారో.. రాజమౌళి అభిమానులు, ఆడియన్స్ అంచనాలు అందుకోవడానికి అంతే కష్టపడుతూ ఆర్. ఆర్. ఆర్ షూటింగ్ ఒక కొలిక్కి తీసుకొస్తున్నాడు.
ఇప్పటికే ఆర్. ఆర్. ఆర్ యాక్షన్, మేజర్ సన్నివేశాలు అన్నీ పూర్తికాగా.. చిన్న చిన్న ప్యాచ్ వర్క్ లతో షూటింగ్ దాదాపుగా కంప్లీట్ అయ్యే స్టేజ్ లో ఉంది అయితే ఆర్. ఆర్. ఆర్ లో రామరాజు పాత్రధారి రామ్ చరణ్ రామరాజు కేరెక్టర్ లో కనిపించడానికి ఎన్ని కష్టాలు పడ్డాడో చెబుతున్నాడు. ఆర్. ఆర్. ఆర్ లో రామరాజు ఓ పోలీస్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ఇక అల్లూరి పాత్రకు మేకప్ వేయడానికి ప్రతి రోజూ రెండున్నర గంటల సమయం పట్టేదని, ఆ మేకప్ తీయడానికి గంటన్నర సమయం పట్టేదని చెప్పిన తాను పోలీస్ ఆఫీసర్‌గా చేయడాన్ని గౌరవంగా భావిస్తున్నానని రీసెంట్ గా జరిగిన ఓ కార్యక్రంలో రామ్ చరణ్ రివీల్ చేసాడు.