Advertisementt

మహేష్ సినిమాలో ఐటెం చెయ్యడం లేదట

Wed 03rd Feb 2021 08:04 PM
bigg boss beauty,monal gajjar,clarifies,mahesh,sarkaru vaari paata,item song  మహేష్ సినిమాలో ఐటెం చెయ్యడం లేదట
Monal Gajjar Clarifies The Rumors About Sarkaru Vaari Paata Item song మహేష్ సినిమాలో ఐటెం చెయ్యడం లేదట
Advertisement
Ads by CJ

బిగ్ బాస్ నుండి బయటికి వచ్చాక కూడా గ్లామర్ బ్యూటీగా దూసుకుపోతున్న మోనాల్ గజ్జర్ కి అటు బుల్లితెర ఇటు వెండితెర అన్నట్టుగా కెరీర్ లో బాగా బిజీ అయ్యింది. అల్లరి నరేష్ సినిమాల ఎఫెక్ట్, ప్రేమ, బ్రేకప్ ఎఫెక్ట్ తో కొన్నాళ్ళు ప్రేక్షకులకు దూరంగా ఉన్న మోనాల్ మళ్ళీ బిగ్ బాస్ తో లైం టైం లోకి వచ్చింది. అఖిల్ తో హగ్గులు, ముద్దులు, గ్లామర్ తో ఓ రేంజ్ రచ్చ చేసిన మోనాల్ బయటికి వచ్చాక కూడా అఖిల్ తో అదే అనుబంధాన్ని మెయింటింగ్ చేస్తున్న మోనాల్ కి బెల్లంకొండ శ్రీనివాస్ అల్లుడు అదుర్స్ లో హాట్ హాట్ స్టెప్పులతో ఐటెం సాంగ్ లో అదరగొట్టేసింది. సినిమా కనక హిట్ అయినట్లయితే మోనాల్ రేంజ్ పెరిగిపోయేది.

ఆ సాంగ్ తర్వాత మోనాల్ పేరు మహేష్ సర్కారు వారి పాటలో మరో ఐటెం సాంగ్ లిస్ట్ లో కెక్కింది. మోనాల్ మహేష్ సర్కారు వారి పాటలో మాస్ స్టెప్స్ తో ఐటెం సాంగ్ చెయ్యబోతున్నట్టుగా సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. తాజాగా మోనాల్ సర్కారు వారి పాటలో తాను ఐటెం సాంగ్ చేస్తున్నట్లుగా వస్తున్న వార్తలను ఖండించింది. తనకి ఎలాంటి ఆఫర్ రాలేదని.. తాను సర్కారు వారి పాటలో ఎలాంటి ఐటెం సాంగ్ చెయ్యడం లేదని కుండబద్దలు కొట్టింది. మరి ఆ లిస్ట్ లో బాలీవుడ్ హాట్ బ్యూటీ ఊర్వశి పేరు కూడా గట్టిగానే వినిపిస్తుంది.

Monal Gajjar Clarifies The Rumors About Sarkaru Vaari Paata Item song:

Monal Gajjar Clarifies The Rumors About Sarkaru Vaari Paata Item song

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ