Advertisementt

బ్యాచ్‌లర్ పర్ఫెక్ట్ ప్లానింగ్

Thu 04th Feb 2021 10:05 AM
most eligible bachelor,akhil,pooja hegde,bommarillu bhasker,allu aravind,ga2 banner  బ్యాచ్‌లర్ పర్ఫెక్ట్ ప్లానింగ్
Most Eligible Bachelor release date locked బ్యాచ్‌లర్ పర్ఫెక్ట్ ప్లానింగ్
Advertisement
Ads by CJ

అఖిల్ అక్కినేని, పూజా హెగ్డే జంటగా మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో బొమ్మరిల్లు భాస్కర్ తెరకెక్కిస్తున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ సినిమాని పర్ఫెక్ట్ ప్లానింగ్ తో రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేసారు. అందరూ సమ్మర్ ని టార్గెట్ చేస్తే మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్  మాత్రం కూల్ గా జూన్ లో దిగుతున్నాడు. జూన్ లో కూల్ ఏముంటుంది పిల్లలకి స్కూల్స్ తెరుస్తారు అనుకుంటున్నారా.. కరోన క్రైసిస్ వలన విద్యా సంవత్సరం మొత్తం మారిపోయింది. దానిలో భాగంగా రీసెంట్ గా తెరిచిన స్కూల్స్ లో.. పది, ఇంటర్ ఎగ్జామ్స్ అన్ని మే కి షిఫ్ట్ అయ్యాయి. అంటే మే ఫస్ట్ వీక్ నుండి జూన్ సెకండ్ వీక్ వరకు ఇంటర్, 10 వ తరగతుల ఎగ్జామ్స్ షెడ్యూల్ విడుదల చేశాయి తెలుగు రాష్ట్రాలు.

దానితో జూన్ సెకండ్ వీక్ కల్లా ఎగ్జామ్స్ హడావిడి ముగిసి స్టూడెంట్స్ అందరూ రిలాక్స్ అయ్యే టైం లో అఖిల్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రిలీజ్ డేట్ అనౌన్స్ చేసారు. అంటే మే లో విడుదలయ్యే సినిమాలకు స్టూడెంట్స్ అంతా ఎగ్జామ్స్ ఫీవర్ తో హాట్ హాట్ గా ఉంటే.. జూన్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ తో రాబోయే అఖిల్ మాత్రం స్టూడెంట్స్ కూల్ గా ఉండే టైం కి దిగుతున్నాడన్నమాట. అందరూ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ రిలీజ్ డేట్ ఎప్పుడెప్పుడూ అంటూ కంగారు పెట్టినా అఖిల్ అండ్ దర్శకనిర్మాతలు మాత్రం హడావిడి లేకుండా మంచి టైం చూజ్ చేసుకున్నారు.

Most Eligible Bachelor release date locked :

Most Eligible Bachelor in Cinemas from June 19th, 2021

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ