Advertisementt

విజయ్ సేతుపతికి మ్యాచ్ కాని వాయిస్

Thu 04th Feb 2021 08:08 PM
vijay sethupati,uppena trailer,vjay sethupati voice,vaishnav tej,krithi shetty,buchhi babu  విజయ్ సేతుపతికి మ్యాచ్ కాని వాయిస్
Unmatched voice for Vijay Sethupathi విజయ్ సేతుపతికి మ్యాచ్ కాని వాయిస్
Advertisement
Ads by CJ

గత ఏడాది మార్చి లో విడుదల కావాల్సిన మెగా మేనల్లుడు వైష్ణవ తేజ్ ఉప్పెన ఫిబ్రవరి 12 న థియేటర్స్ లోకి అందునా 100 పర్సెంట్ అక్యుపెన్సీతో దిగబోతుంది. కరోనా క్రైసిస్ వలన సినిమా వాయిదా పడి.. ఓటిటి నుండి 18 కోట్ల భారీ డీల్ వచ్చినా నిర్మాతలు ఉప్పెన సినిమాని థియేటర్స్ లో విడుదల చేసేందుకే మొగ్గు చూపారు. గత రెండు నెలలుగా 50 పర్సెంట్ అక్యుపెన్సీకి కూడా లొంగకుండా.. 100 శాతం ప్రేక్షకులతో బరిలోకి దింపుతున్నారు. తాజాగా విడుదలైన ఉప్పెన ట్రైలర్ లో వైష్ణవ తేజ్ లుక్స్, కేరెక్టర్ అన్ని బావున్నాయి. ప్రేమ, పగ, ధనిక పేద, పరువు ప్రతిష్ట లను ఈ ట్రైలర్ లో చూపించారు. ఈ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ గా నటించాడు. వైష్ణవ తేజ్ హీరోగా అనే క్యూరియాసిటీగా కన్నా విజయ్ సేతుపతి విలనిజం కోసం ఫాన్స్, ప్రేక్షకులు బాగా వెయిట్ చేస్తున్నారు.

అయితే దర్శకుడు బుచ్చిబాబు విజయ్ సేతుపతి కేరెక్టర్ ని పవర్ ఫుల్ గానే చూపించాడు. విజయ్ సేతుపతి లుక్స్ లోను, ఆయన కేరెక్టర్ లోని బలం బాగానే ఉన్నా.. విజయ్ సేతుపతి వాయిస్ మాత్రం మ్యాచ్ కాలేదు. ఆయన కేరెక్టర్ కి అంటే విలన్ కి ఉండాల్సిన పవర్ ఫుల్ వాయిస్ మిస్ అయ్యింది. విజయ్ సేతుపతి గంభీరానికి ఆయన చెప్పే డైలాగ్ కి పొంతన కుదరడం లేదు. అంటే విజయ్ సేతుపతి డబ్బింగ్ చెప్పిన వాయిస్ విజయ్ సేతుపతి పాత్రకి కి లింక్ అవ్వడం లేదు. అన్నీ అలోచించి ఇంతకాలం వెయిట్ చేసిన ఉప్పెన టీం కి అది ఎందుకు అర్ధం కాలేదో .. ఇప్పుడు ప్రేక్షకులకు అర్ధం కావడం లేదు. ఉప్పెన ట్రైలర్ చూసింది మొదలు విజయ్ సేతుపతికి డబ్బింగ్ చెప్పింది ఎవరా అంటూ ఆరాలు మొదలు పెట్టారు. ఎందుకంటే విజయ్ గొంతుకు అస్సలు సూట్ కాని ఆ వాయిస్ ఎవరిదో చూద్దామని.

 

Unmatched voice for Vijay Sethupathi:

Uppena trailer review

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ