సింగర్ సునీత రెండో పెళ్లి చేసుకుని భర్త రామ్ తో హాయిగా ఉంది. ఆమె పెళ్లి సోషల్ మీడియాలో ఎంత ట్రెండ్ అయ్యిందో తెలిసిందే. పెళ్ళికి ముందు పార్టీలు, ప్రీ వెడ్డింగ్ సెలెబ్రేషన్స్ అబ్బో అన్నీ ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. సునీత మళ్ళీ పెళ్లి ముచ్చట ఇంకా ముగియ లేదు. అంటే పెళ్లి తర్వాత సునీత తన పిల్లలని ఎంత ప్రేమిస్తుందో ఎప్పటికప్పుడు పిక్స్ తో అందరికి చూపిస్తుంది. తన పిల్లలతో స్వీట్ మెమోరీస్ ని సోషల్ మీడియా లో షేర్ చెయ్యడమే కాదు.. కొత్తగా పెళ్ళయిన సునీత తన భర్త గుండెల మీద వాలిన ఫొటోస్ తో తను ఎంత సంతోషంగా ఉన్నానో చెప్పకనే చెప్పేసింది.
అయితే సునీత ని రామ్ రెండో వివాహం చేసుకోవడమే కాదు.. ఆమె పిల్లలతోను రామ్ కి మంచి రిలేషన్ ఉంది. సునీత పెళ్లి తర్వాత కూడా సునీత దగ్గరే ఉంటున్నారు ఆమె పిల్లలు. ఇక భారీగా ఆస్తులు కలిగిన రామ్ ఇప్పుడు సునీత పిల్లలకి కూడా అందులో వాటా ఇవ్వబోతున్నాడట. అంతేకాదు.. తన బిజినెస్ ల్లోనూ సునీత పిల్లలని ఇన్వాల్వ్ చేయబోతున్నాడనే న్యూస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. దానితో సునీత కే కాదు.. సునీత పిల్లలకి రామ్ మంచి లైఫ్ ఇస్తున్నాడంటూ రామ్ ని మెచ్చేసుకుంటున్నారు నెటిజెన్స్.