Advertisementt

డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన కమెడియన్

Sat 06th Feb 2021 11:55 AM
jabardasth comedian,thanmay,drunk and drive  డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన కమెడియన్
Jabardasth Comedian caught in Drunk and Drive డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుపడిన కమెడియన్
Advertisement
Ads by CJ

జబర్దస్త్ లోకి కమెడియన్స్ గా అడుగుపెట్టడం అంటే వాళ్ళ రేంజ్ మారిపోయినట్టే.. ఎక్కడో పల్లెటూర్ల నుండి సిటీకి వచ్చి జబర్దస్త్ లో చోటు సంపాదించి.. అక్కడ నుండి వెండితెర ఇతర అవకాశాలతో బిజీ అవుతూ పెద్ద పెద్ద ఇళ్ళు కొనుక్కుని, కార్లు కొనుక్కుని రిచ్ లైఫ్ లోకి వెళ్లిపోతున్నారు. అయితే టీం లీడర్స్ లైఫ్ రిచ్ గానే ఉంటున్నా కొంతమంది కమెడియన్స్ కి ఇప్పటికి  ఎపిసోడ్ కి ఇంత చొప్పునే ముడుతుంది అంటూ వాపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇక జబర్దస్త్ స్టేజ్ మీద అమ్మాయిల కన్నా అందులో అబ్బాయిలే లేడి గెటప్స్ వేస్తూ కామెడీ పండిస్తున్నారు. అలా జబర్దస్త్ కమెడియన్స్ లో చాలామంది అబ్బాయిలు లేడి గెటప్స్ తో పాపులర్ అయ్యారు. అందులో తన్మయ్ ఒకరు. తన్మయ్ లేడి గెటప్ తో మంచి క్రేజ్ సంపాదించాడు. అయితే తాజాగా జబర్దస్త్ లో లేడి గెటప్ వేసే తన్మయ్ గత రాత్రి హైదరాబాద్ సిటీలో జరిగిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుపడ్డాడు.

లేడి గెటప్ తో బాగా పాపులర్ అయిన తన్మయ్ గత రాత్రి కొంతమంది ఫ్రెండ్స్ తో కలిసి డ్రింక్ చేసి కార్ డ్రైవ్ చేస్తూ ఉండగా..  జూబ్లిహిల్స్‌లో చేసిన తనిఖీల్లో తన్మయ్ పోలీస్ లకు దొరికిపోయాడు. తన్మయ్ తో పాటుగా కొంతమంది ఈవెంట్ ఆర్గనైజర్లు ని కూడా ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుపడినట్లుగా తెలుస్తుంది. ఈ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో 5 కార్లు, 2 ఆటోలు, 12 బైక్‌లను పోలీసులు పట్టుకున్నారు. పట్టుబడిన వారిలో కొంతమంది హోమ్ మంత్రి బంధువులమంటూ చేసిన రచ్చ తో పోలీస్ లు వాళ్ళని అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్ కి తరలించినట్టుగా సమాచారం.

Jabardasth Comedian caught in Drunk and Drive:

Jabardasth Comedian Thanmay caught in Drunk and Drive

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ