Advertisementt

మహేష్ కి కూడా తప్పలేదు

Sun 07th Feb 2021 01:42 PM
sarkaru vaari paata movie,mahesh babu,dubai,fight scene leaked  మహేష్ కి కూడా తప్పలేదు
Even Mahesh can't escape మహేష్ కి కూడా తప్పలేదు
Advertisement
Ads by CJ

ఆధునిక యుగంలో సోషల్ మీడియా, ఫోన్స్ ఒకటేమిటి ఎలక్ట్రికల్ పరికరాల వాడుక విపరీతంగా పెరిగిపోతున్న తరుణంలో దేన్నీ సీక్రెట్ గా దయలేకపోతున్నారు. ఏం జరిగినా దాన్ని ఎవరో ఒకరు ఫోన్ తో షూట్ చేసే సోషల్ మీడియాలో వైరల్ చెయ్యడం అనేది మాములు విషయం అయ్యిపోయింది. సినిమా సెట్స్ లో ఫోన్, లాప్ టాప్స్ లాంటి పరికరాలను వాడకుండా కట్టడి చేస్తున్నా జనాలు ఎదో ఒకలాగా సెట్స్ లో జరిగే సీన్స్ ని లీక్ చెయ్యడమనేది పరిపాటిగా మారింది. ఇప్పటికే RRR నుండి ఎన్టీఆర్ లుక్, పుష్ప సెట్స్ నుండి అల్లు అర్జున్ లుక్స్, అలాగే రీసెంట్ గా ఓ సాంగ్ క్లిప్స్ ని లీక్ చేసినట్టుగా ఇప్పుడు మహేష్ సర్కారు వారి పాట కూడా లీకుల రాయుళ్ళకి దొరికిపోయింది.

మహేష్ - పరశురామ్ సర్కారు వారి పాట దుబాయ్ షెడ్యూల్ తో షూటింగ్ మొదలు పెట్టుకుంది. ప్రస్తుతం సర్కారు వారి పాట దుబాయ్ లోకి కొన్ని రేర్ లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుకుంటున్న విషయం మహేషే బయటపెట్టాడు. అయితే ఇప్పుడు సర్కారు వారి పాట సెట్స్ నుండి ఓ ఫైట్ సీక్వెన్స్ లోని ఆన్ లొకేషన్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేసారు. ప్రస్తుతం సర్కారు వారి పాట యాక్షన్ సీక్వెన్స్ ఫొటోస్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే చిత్ర బృందం ఎంతగా జాగ్రత్తలు తీసుకుంటున్నా కూడా ఇలాంటి లీకులను ఆపడంలో విఫలమవుతుంది. 

Even Mahesh can't escape:

Sarkaru Vaari Paata Fight scene pics leaked

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ