బాలకృష్ణ - బోయపాటి కాంబోలో తెరకెక్కుతున్న BB3 టైటిల్ సస్పెన్స్ ఇంకా వీడలేదు. మోనార్క్ టైటిల్ BB3 కి ఫిక్స అంటూ నందమూరి ఫాన్స్ హడావిడీ చేస్తున్నా బోయపాటి కానీ BB3 టీం కానీ క్లారిటీ ఇవ్వడం లేదు. సోషల్ మీడియాలో మోనార్క్ టైటిల్ ట్రేండింగ్ లోనే ఉంది. ఇక రామోజీ ఫిలిం సిటీలో స్పెషల్ గా వేసిన సెట్ లో BB3 షూటింగ్ చిత్రకరణ చేపట్టిన బోయపాటి ప్రస్తుతం బాలయ్య పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్టుగా తెలుస్తుంది. రిలీజ్ డేట్ తో పాటుగా బాలకృష్ణ సూపర్ స్టైలిష్ లుక్ ని రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేశారు.
అయితే BB3 లో బాలకృష్ణ అఘోర పాత్రలో కొద్దిసేపు కనిపించబోతున్నారనే టాక్ ఉంది. ప్రస్తుతం ఫిలిం సిటీలో బాలయ్య అఘోర పాత్రకి సంబందించిన సీన్స్ షూట్ జరుగుతుంది అంటున్నారు. బాలయ్య అఘోర పాత్ర పై భారీ యాక్షన్ సన్నివేశాల షూట్ జరుగుతుంది అని.. ప్రస్తుతం రామ్ లక్షణ్ లు బాలయ్య అఘోర పాత్ర పై యాక్షన్ సన్నివేశాలకు డైరెక్షన్ చేస్తున్నారట. ఈ అఘోర పాత్ర తాలూకు సన్నివేశాలే సినిమాకి హైలెట్స్ అనేలా ఉంటాయని.. అలాగే బాలయ్య అఘోర పాత్ర ని చూస్తే షాక్ అవుతారట కూడా. ప్రస్తుతం బాలయ్య అఘోర పిక్ ఒకటి సోషల్ మీడియాలో హల చల్ చేస్తుంది కూడా. మరి చూడడానికే భయంకరంగా కనబడుతున్న బాలయ్య అఘోర లుక్ ని మీరు ఓ లుక్కెయ్యండి.