ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబోలో మొదలైన సలార్ సినిమా షూటింగ్ గోదావరి ఖని లో షూటింగ్ మొదలైంది, ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది అనేది అందరికి తెలిసిన అప్ డేట్స్. సలార్ యూనిట్ కి యాక్సిడెంట్ అవడం దగ్గరనుండి.. సలార్ షెడ్యూల్ కంప్లీట్ అవడం వరకు ప్రతిదీ న్యూస్ లో ఉంటూనే వస్తుంది. అటు శృతి హాసన్ హీరోయిన్ గా కన్ఫర్మ్ అయ్యింది అనేది ఎంత పెద్ద న్యూస్ అయ్యిందో.. ప్రియాంక చోప్రా సలార్ లో స్పెషల్ సాంగ్ చేయబోతుంది అనేది గాసిప్ కూడా సోషల్ మీడియాలో అదే రేంజ్ లో వైరల్ అవుతుంది. ఇక విలన్ గా కన్నడ ఆర్టిస్ట్ మధు నాయుడు పేరు సలార్ విలన్ గా తెరపైకి వచ్చింది.
అయితే ఇక్కడ విశేషం ఏమిటి అంటే మధు నాయుడు సలార్ లో నటిస్తున్నది నిజమే అయినా.. అతను ఒక్కడే సలార్ మెయిన్ విలన్ కాదు. అంటే సినిమాలో అతనొక్కడే విలన్ కాదు. ఈ సినిమాలో ఆరు నుండి ఎనిమిదిమంది విలన్స్ ని ప్రశాంత్ నీల్ విలన్స్ గా ఎంపిక చేయబోతున్నాడట. అంటే మధునాయుడు ఆ ఆరు నుండి ఎనిమిదిమందిలో వన్ అఫ్ ద విలన్ మాత్రమే. మెయిన్ విలన్ కాదు. ఇంకా ఇంకా చాలామంది విలన్స్ పేర్లు త్వరలోనే వినాల్సి వస్తుంది. ఏ ఏ ఇండస్ట్రీ నుండి ఎంతమంది విలన్స్ ని పట్టుకొస్తాడో.. ప్రశాంత్ నీల్. తమిళ్, తెలుగు, హిందీ నుండి ఎవరెవరిని ఏఏ కేరెక్టర్స్ కి ప్రశాంత్ నీల్ సలార్ విలన్స్ గా సెట్ చెయ్యబోతున్నాడో.. సలార్ విలన్ సెటప్ మాత్రం చాలా హెవీగా ఉండబోతుందట. ఇకపై సలార్ విలన్స్ లిస్ట్ లో మరెన్ని పేర్లు వినాల్సి వస్తుందో జస్ట్ వైట్ అండ్ సి.