మెగా కాంపౌండ్ కి అల్లు వారికీ మధ్యన బాగా గ్యాప్ వచ్చింది అనేది గత కొన్ని రోజులుగా అటు సోషల్ మీడియాలో ఫాన్స్ మాట్లాడుకుంటున్నారు. ఇటు మీడియాలోనూ వినిపిస్తుంది. విచిత్రం ఏమిటి అంటే దాన్ని వ్యతిరేకించే వాళ్ళు లేరు, సమర్ధించేవాళ్ళు లేరు, ఖండించే వాళ్ళు లేరు. అది అలా స్ప్రెడ్ అవుతూనే ఉంది. మొన్నటికి మొన్న అలా వైకుంఠపురములో వన్ ఇయర్ సెలెబ్రేషన్స్ చేసుకున్న అల్లు అర్జున్.. ఎప్పుడూ తన సినిమాల ఫంక్షన్స్ చేసుకున్నప్పుడు చిరు లేకుండా, రాకుండా ఫంక్షన్స్ చేసుకొని బన్నీ ఆ సీజన్ లో అలా వైకుంఠపురములో తన ఫంక్షన్ కి రాకుండా మహేష్ సరిలేరు నీకెవ్వరూ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి చిరంజీవి గెస్ట్ గా వెళ్లారు. అది మనసులో పెట్టుకునే అల్లు అర్జున్ అలా వైకుంఠపురములో వన్ ఇయర్ సెలెబ్రేషన్స్ అప్పుడు చిరు ని పిలవకుండానే కానిచ్చేశాడు అనే డిస్కర్షన్స్ మీడియాలోనే కాదు ఇండస్ట్రీలో కూడా జరిగాయి.
విచిత్రం ఏమిటి అంటే.. బన్నీ అంటే కుర్రాడు పిల్లాడు అనుకోవచ్చు. ఇప్పుడిప్పుడే స్టార్ డం చవి చూస్తున్నాడు కాబట్టి.. తనకంటూ ఓ ఫాలోయింగ్ ఉంది. తనకి స్టార్ డం ఉంది అని ప్రూవ్ చేసుకునే తాపత్రయం అనుకోవచ్చు. కానీ గత మూడు దశాబ్దాలుగా చిరంజీవి వెన్నంటే ఉంటూ.. చిరు నీడలా ఉంటూ.. చిరు ఏ కార్యక్రమానికి అటెండ్ అయినా పక్కనే ఉండే అల్లు అరవింద్ గత కొన్నాళ్లుగా చిరు పక్కన కనిపించడం లేదు. రీసెంట్ గా చిరు అటెండ్ అయినా ఏ ఫంక్షన్ లోను మనం అల్లు అరవింద్ ని చూడలేదు. మొన్నటికి మొన్న వైష్ణవ తేజ్ ఉప్పెన ఈవెంట్ లోను చిరు తప్ప అరవింద్ అటెండ్ కాలేదు. తన ఆహా ఈవెంట్ వన్ ఇయర్ ఫంక్షన్ మాత్రం బాగానే సెలెబ్రేట్ చేసుకున్నారు. ఆ ఫంక్షన్ కి మెగా హీరోలెవరూ అటెండ్ కాకపోవడం గమనార్హం. ఇది అల్లు - మెగా కంపౌండ్స్ మధ్యన గ్యాప్ ఉందనే అనుకోవాలా? పెరిగింది అనే అనుకోవాలా?