బాలీవుడ్ లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ ఎవరు అంటే.. 50 ఏళ్ళు దాటినా ఇప్పటికి కండల వీరుడు సల్మాన్ ఖాన్ పేరే చెబుతారు. తన కండలతో యువతులను కవ్విస్తాడు. అశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. చాలామంది హీరోయిన్స్ తో లవ్ ఎఫైర్స్, రూమర్స్, గాసిప్స్ వింటూనే ఉన్నాము. 50 ఏళ్ళు దాటుతున్నా ఇప్పటివరకు పెళ్లి అనే పదాన్ని పలకడం లేదు. చేసుకునే ఉద్దేశ్యం కూడా లేదని తేల్చేసాడు. కానీ మొన్నామధ్యన పెళ్లి అనే మాటలు వినిపించాయి. సరే అది బాలీవుడ్ వ్యవహారం మనకెందులే అని వదిలేస్తాము.
మన టాలీవుడ్ కి అలాంటి మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్ లా తయారయ్యాడు ప్రభాస్. రెండు తెలుగు రాష్ట్రాల్లో అంతెందుకు మొత్తం పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన బాహుబలి ప్రభాస్ అంటే ఎంటైర్ ఇండియాలో ఇష్టపడని అమ్మాయిలు ఎవరుంటారు. అమ్మాయిల కలలను కొల్లగొడుతున్న ప్రభాస్ కూడా ఎందుకో పెళ్లంటే ఇంట్రెస్ట్ చూపించడం లేదు. బాహుబలి అవగానే పెళ్లి అన్న ప్రభాస్, సాహో అయ్యాక అన్నాడు. మళ్ళీ రాధేశ్యామ్ అంటూ పోస్ట్ పోన్ చేసినా.. ఇప్పుడు వరసగా మూడు సినిమాల లైన్ లో పెట్టాడు. సో ఇలా తన పెళ్లిని వాయిదా వేసుకుంటూనే వెళుతున్నాడు.
మొన్నటికిమొన్న ప్రభాస్ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో ప్రభాస్ పెదనాన్న కృష్ణం రాజు మట్లాడుతూ.. ప్రభాస్ ఈరోజు ఓకె అంటే రేపు పెళ్లి చేసేస్తాం. మేమంతా సిద్ధంగా ఉన్నామంటూ ఆయన ఓపెన్ గానే చెప్పారు. ప్రభాస్ మాత్రం పెళ్ళికి ఎందుకు వెనకాడుతున్నాడో? అసలు ఈ కండల వీరులందరికి పెళ్లంటే ఎందుకు అయిష్టమో?