ప్రశాంత్ నీల్ తో ఎన్టీఆర్ సినిమా ఇది ఎప్పటినుండో ప్రచారం జరుగుతున్నన్యూస్. మైత్రి మూవీస్ వారు, ప్రశాంత్ నీల్ అటు ఎన్టీఆర్ సోషల్ మీడియాలో దొంగాటలు ఆడారు. కానీ కన్ఫర్మేషన్ ఇవ్వలేదు. ఈలోపు మధ్యలోకి ప్రభాస్ వచ్చి చేరాడు. ప్రశాంత్ నీల్ - ప్రభాస్ కాంబో సలార్ సెట్ అవడమే కాదు.. ప్రశాంత్ నీల్ కెజిఎఫ్ ఫినిష్ కాకుండానే ప్రభాస్ సలార్ ఫస్ట్ షెడ్యూల్ ముగించేశాడు. అప్పటినుండి ప్రశాంత్ నీల్ మీద ఎన్టీఆర్ ఫాన్స్ గుర్రుగా ఉన్నారు. ఇక ప్రస్తుతానికి ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీని అందరూ లైట్ తీసుకుంటున్నట్టు కనబడుతున్న టైం లో మళ్ళీ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో తెరపైకి వచ్చింది.
మైత్రి మూవీస్ వారు నిర్మించిన ఉప్పెన సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబో మూవీపై ఎన్టీఆర్ ఫాన్స్ అడిగిన ప్రశ్నకు మైత్రి వారు కన్ఫర్మ్ అని చెప్పడంతో ఎన్టీఆర్ తో ప్రశాంత్ నీల్ మూవీ కన్ఫర్మ్ అయ్యింది. దానితో ఎన్టీఆర్ ఫాన్స్ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఉప్పెన సినిమా తో ఫుల్ జోష్ లో ఉన్న మైత్రి మూవీస్ వారు వరస సినిమాలతో చెలరేగిపోతున్నారు. ప్రస్తుతం మహేష్ సర్కారు వారి పాట, అల్లు అర్జున్ పుష్ప, పవన్ - హరీష్ శంకర్ కాంబో మూవీ, చిరు - బాబీ మూవీ, ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ మూవీ, నాని అంటే సుందరానికి మూవీస్ తో పాటు మరిన్ని ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెడుతున్నారు మైత్రి వారు. మరి ఇప్పడు ఎన్టీఆర్ RRR అవ్వగానే త్రివిక్రమ్ తో సినిమా ఫినిష్ చేసి ప్రశాంత్ నీల్ తో బాక్సులు బద్దలయ్యే మాస్ యాక్షన్ మూవీ కి రెడీ అవుతాడన్నమాట.