పవన్ కళ్యాణ్ స్క్రీన్ మీద కనిపించి మూడేళ్లయింది. ప్రభాస్ సాహో తర్వాత కనబడి టు ఇయర్స్ అయ్యింది అని మనందరం మాట్లాడుకుంటాం కానీ.. ఎఫ్ 2 తర్వాత వెంకటేష్ స్క్రీన్ మీద కనిపించి అంతే కాలమయ్యింది. నాగార్జున అయినా బుల్లితెర మీద ఏదో విషయంలో కనిపిస్తూ ఉంటారు. మిగతా హీరోలయినా ప్రవేట్ ఫంక్షన్స్ లోనో, సినిమా ఈవెంట్స్ లో కనిపిస్తుంటారు. కానీ అసలు బయటికొచ్చే అలవాటే లేని వెంకటేష్ ని బిగ్ స్క్రీన్ మీద చూడాలని ఫాన్స్ వెయిటింగ్. సో నారప్ప కేరెక్టర్ కోసం వెంకటేష్ ఓ స్పెషల్ గెటప్ మెయింటింగ్ చేసిన వెంకీ.. ఆ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసి గెటప్ మార్చేసి స్టైలిష్ లుక్ తో అనిల్ రావిపూడి ఎఫ్ 3 షూటింగ్ కి వెళ్లిపోయారు.
ఇప్పుడిక నారప్ప సినిమా బాధ్యత మొత్తం నిర్మాత, వెంకటేష్ అన్నగారు సురేష్ బాబుదే. ఫైనల్ ఎడిట్ కానీ, ఫైనల్ డెసిషన్ కానీ అన్ని సురేష్ బాబు చేతిలోనే ఉన్నాయి. రిలీజ్ డేట్ దగ్గరపడుతోంది. ఇప్పటివరకు ఫ్యామిలీ స్టోరీస్ నే తెరకెక్కించిన దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల నారప్ప లాంటి యాక్షన్ థ్రిల్లర్ ని ఎలా హ్యాండిల్ చేసాడు. దానిని సురేష్ బాబు ఎలా మ్యానేజ్ చేస్తారు. శ్రీకాంత్ అడ్డాల - సురేష్ బాబు నారప్పని ఎలా ఆడియన్స్ ముందుకు తీసుకొస్తారో చూడాలి. వెంకీ మాత్రం నారప్పను పూర్తిగా సురేష్ బాబు చేతిలో పెట్టి తాను మాత్రం ఎఫ్ 3 తో బిజిగా ఉన్నారు.
అంతేకాదండోయ్ ఇంకో 10 డేస్ లో వెంకీ నెక్స్ట్ ఫిలిం ఎనౌన్సమెంట్ కూడా రాబోతుంది.