RX 100 తో హీరోయిన్ గా లాంచ్ అయ్యి.. ఫస్ట్ సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన పాయల్ రాజ్ ఫుట్ కి ఆ టైం లో వచ్చిన క్రేజ్ అంతా ఇంతా కాదు. యూత్ వెర్రెక్కిపోయారు. కుర్రాళ్ళు కిర్రెక్కిపోయారు. కేవలం పాయల్ రాజపుట్ పేరు మీదే సినిమాలు బిజినెస్ అయ్యిపోతాయా అనేంత మార్కెట్ క్రియేట్ అయ్యే టైం కి.. ఆ అమ్మాయి కూడా అది నిజమనే భ్రమలో ఉంది. అందాల ప్రదర్శన మాత్రమే తన ప్రధాన ఆయుధం అనుకుంది. అదే బాటలో వెళ్ళిపోయింది. కానీ అదే పాయల్ వేసిన తప్పటడుగు అయ్యింది.
అందం, అభినయం అన్నీ ఉన్నా కూడా అదృష్టం వరించలేదు. తాను ఎన్నుకున్న సినిమాలు కలిసి రాలేదు. అపజయాలు పలకరించాయి. కెరీర్ వెనక్కి వెళ్ళిపోయింది. అప్పటినుండి ఇప్పటివరకు ఇంకా ఇంకా అదే స్కిన్ షోని నమ్ముకుంటూ. ఎప్పటికప్పుడు మరో కొత్త ఆఫర్ కోసం మరో కొత్త ఫోటో షూట్ ని నమ్ముకుంటుంది తప్ప.. తన స్కిల్స్ చూపించే ప్రయత్నాలేమీ చెయ్యడం లేదు. నిజానికి పాయల్ రాజపుట్ చాలామంచి ఆప్షన్ అయ్యేది ఇప్పుడున్న హీరోస్ కి.
ఇదే మరో యాంగిల్ లో చూసుకుంటే కృతి శెట్టి అనే అమ్మాయి.. లేటెస్ట్ సెన్సేషన్ ఒక్క సినిమా కూడా రిలీజ్ అవ్వకుండానే రెండు సినిమాల్లో కన్ఫర్మ్ అయ్యిపోయింది. ఇంకా చాలా సినిమాల ఆఫర్స్ క్యూ కట్టి ఉన్నాయి కృతి శెట్టి ముందు. మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యిపోయింది టాలీవుడ్ కి. ఎందుకంటే కృతి శెట్టి ఉప్పెన సినిమాలో అంత బాగా పెరఫార్మెన్స్ చేసింది అనే పేరు రావడం వలన. అందులోను క్యూట్ లుక్స్, అందం, ప్రమోషన్స్ లో కృతి శెట్టి పద్దతికి చాలామంది హీరోలు ఫిదా అయ్యిపోతున్నారు.
దానికి దీనికి తేడా అంటే స్కిన్ షో అండ్ స్కిల్ షో కి ఉండే తేడా అదే. నయనతార, అనుష్క, త్రిష, సమంత, కాజల్ ఇలాంటి హీరోయిన్స్ ఒక దశాబ్డం పాటు ఇండస్ట్రీలో కొనసాగగలిగారంటే.. కేవలం అంగాంగ ప్రదర్శన వలన మాత్రమే కాదు.. అభినయంతో కూడా మరియు మంచి ప్రాజెక్ట్స్ ఏరి కోరి ఎంచుకోవడం వలన. ఇది ఈ తరం హీరోయిన్స్ కూడా నేర్చుకుంటే బావుంటుంది.