Advertisementt

ముంబైకి మకాం మారుస్తా అంటున్న రౌడీ

Fri 12th Feb 2021 08:56 AM
vijay deverakonda,mumbai working style,liger,sala cross bread,puri jagannadh,mumbai,working style,rowdy star  ముంబైకి మకాం మారుస్తా అంటున్న రౌడీ
Rowdy star saying he will move to Mumbai ముంబైకి మకాం మారుస్తా అంటున్న రౌడీ
Advertisement
Ads by CJ

టాలీవుడ్ క్రేజీ హీరోగా పాన్ ఇండియాలోకి అడుగుపెట్టబోతున్న విజయ్ దేవరకొండ.. పూరి దర్శకత్వంలో చేస్తున్న లైగర్ పాన్ ఇండియా ఫిలిం నిన్న అంటే గురువారం నుండి ముంబై లో షూటింగ్ మళ్ళీ ప్రారంభించుకుంది. ఈమధ్యనే లైగర్ టైటిల్ ని విడుదల చేసిన టీం రీసెంట్ గా సెప్టెంబర్ 9 న లైగర్ రిలీజ్ డేట్ కన్ఫర్మ్ చేసింది. లైగర్ సినిమా షూటింగ్ మొత్తం ఎక్కువగా ముంబై పరిసర ప్రాంతాల్లోనే జరిగింది, జరుగుతుంది. కరణ్ జోహార్ హాండ్స్ లో సేఫ్ గా షూటింగ్ మొదలైన లైగర్ సినిమా షూటింగ్ లో పాల్గొంటున్న విజయ్ దేవరకొండ కి ముంబై మకాం మార్చే ఆలోచన వచ్చినట్లుగా కనబడుతుంది. ముంబై లో షూటింగ్ ప్రశాంతంగా సాగుతుంది అని, హైదరాబాద్ లాగా హడావిడి లేదంటున్నాడు రౌడీ స్టార్.

ముంబై లో షూటింగ్ ని ఆస్వాదిస్తున్నా అని, హైదరాబాద్ లో అయితే ఎక్కడికి వెళ్లినా నన్ను చూడడానికి వచ్చే వాళ్లతో కాస్త ఇబ్బంది ఉంటుంది. అదే ముంబైలో షూటింగ్ చేసుకుని హాయిగా హోటల్ కి వెళ్ళిపోయి రెస్ట్ తీసుకోవచ్చు.. ఇక్కడ ముంబైలో నన్ను పట్టించుకునే వాళ్ళు ఎవరూ ఉండరు.. నా జీవన శైలిని ప్రభావితం చేసే ఏ అంశాన్ని నేను ఆమోదించను. ముంబై లో సిబ్బంది కూడా ఎంతో నైపుణ్యం ఉన్నవారు.. హైదరాబాద్ అయితే పొగడ్తలు, పబ్లిసిటీ, ప్రశంశలు ఇవన్నీ చూస్తే మనం ట్రాక్ తప్పే ఆలోచనలు వస్తాయి. ముంబైలో అలా ఉండదు. అందుకే నేను ముంబై లో పని చేసుకుందామనుకుంటున్నా.. పని లేనప్పుడు హైదరాబాద్ ఇంటికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది అనే ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నాడు రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ. 

Rowdy star saying he will move to Mumbai:

Vijay Deverakonda says about Mumbai working style

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ