Advertisementt

వరంగల్ శ్రీను పట్టు వదలట్లేదు

Fri 12th Feb 2021 04:43 PM
warangal srinu,dil raju,nizam rights,adi sai kumar,shashi movie,check movie,virata parvam movie,acharya movie,nizam  వరంగల్ శ్రీను పట్టు వదలట్లేదు
Warangal Srinu did not letting go వరంగల్ శ్రీను పట్టు వదలట్లేదు
Advertisement
Ads by CJ

ఈ సంక్రాతి టైం లో ఒక్కసారిగా క్రాక్ సినిమా విషయంలో లైం లైట్ లోకి వచ్చిన వరంగల్ శ్రీను.. దిల్ రాజు - శిరీష్ లపై మీద విరుచుకుపడ్డాడు. పంపిణి రంగంలో జరుగుతున్న అవకతవకలన్నిటిని మీడియా ముందు బహిర్గతం చేసాడు. అక్కడనుండి కూడా అదే స్పీడు, అదే పంధా కొనసాగిస్తూ ఆచార్య నైజాం రైట్స్ తీసుకోవడం కానీ, ఆర్. ఆర్. ఆర్ నైజం హక్కుల కోసం దిల్ రాజుతో పోటీ పడడం కానీ వీటన్నిటిలో కూడా ఢీ ఢీ అంటే ఢీ అన్నట్టుగా తలపడుతున్నాడు. గోపీచంద్ - సంపత్ నందిలా సీటిమార్ ఏప్రిల్ 2 న విడుదల కాబోతుంది. ఆ సినిమాని వరంగల్ శ్రీనుని నైజాం లో విడుదల చేస్తున్నాడు. అలాగే రానా - సాయి పల్లవి - వేణు ఉడుగుల విరాట పర్వం సినిమా నైజాం హక్కులని కూడా వరంగల్ శ్రీనుని దక్కించుకున్నాడు.

ఒకవైపు పెద్ద సినిమాలు చేస్తూనే మరొకవైపు చిన్న సినిమాలకు సపోర్ట్ గా ఉంటా అంటూ ఆది సాయి కుమార్ లేటెస్ట్ మూవీ శశి అనే మూవీ ని నైజాం లో రిలీజ్ చెయ్యబోతున్నాడు. మార్చ్ 19 న శశి సినిమా ని రిలీజ్ చెయ్యబోతున్నాడు. చిన్న సినిమాలకు కూడా తాను సపోర్ట్ గా ఉంటానని, చిన్న హీరోలకి అండగా నిలబడతా అంటూ దిల్ రాజు కి మెల్లిగా చెక్ పెడుతున్నాడు. అన్నట్టు నితిన్ లేటెస్ట్ చెక్ మూవీ నైజాం రైట్స్ ని 5.50 కోట్లకి ఎగరేసుకుపోయాడు. నితిన్ చెక్ మూవీ ఫిబ్రవరి 26 న విడుదలకు సిద్దమవుతున్న విషయం తెలిసిందే.

Warangal Srinu did not letting go :

Warangal Srinu is all set to release Adi Sai Kumar latest movie Shashi in Nizam

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ