Advertisementt

రష్మిక చరిష్మా పనికొస్తుందా.?

Sat 13th Feb 2021 10:34 AM
rashmika,pogaru movie,feb 19th release,dhruv sarja  రష్మిక చరిష్మా పనికొస్తుందా.?
Will Rashmika's charisma work? రష్మిక చరిష్మా పనికొస్తుందా.?
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లోనే కాదు.. బాలీవుడ్ లో కోలీవుడ్ లోను దూకుడు చూపిస్తున్న రష్మిక క్రేజ్ ప్రేక్షకుల్లో ఎంతుందో.. ఏ లాంగ్వేజ్ ఆడియన్స్ ఎంతగా రిసీవ్ చేసుకుంటారో తెలియదు. కానీ పాపకి లాక్కు బాగా కలిసొచ్చి సినిమాల మీద సినిమాలు చేస్తుంది. పాన్ ఇండియా మూవీ, బాలీవుడ్ మూవీస్ అబ్బో ఒకటేమిటి అన్ని లాంగ్వేజ్ లని ఓ చూపు చూస్తున్న రష్మిక ఛరిష్మాని నమ్ముకుని కన్నడ డబ్బింగ్ పొగరు రేపు 19 న తెలుగులో రిలీజ్ కాబోతుంది. అందులో హీరో ఎవరు అని ఎవరికీ తెలియదు. కన్నడ కెజిఎఫ్ సినిమా అనుకోకుండా భారీ హిట్ కొట్టడంతో.. ఇప్పుడు ప్రతి కన్నడ సినిమా తెలుగునాట దండెత్తాలని ప్రయత్నిస్తున్నాయి.

ఆ మధ్యన శ్రీమన్నారాయణ అనే సినిమా డబ్ అయ్యింది. అది భంగపడి వెళ్ళింది. ఇప్పుడు పొగరు సినిమా తయారైంది. ఆ సినిమాకున్న ఏకైక చరిష్మా రష్మిక. రష్మిక క్రేజ్, రష్మిక లక్కు, రష్మిక గ్లామర్, రష్మిక చరిష్మా తో పొగరు కలెక్షన్స్ వచ్చేస్తాయని నిర్మాతలు నమ్మి పొగరు ను భారీగా తెలుగులో విడుదల చేస్తున్నారు. ఆ సినిమాలో రష్మిక తప్ప మరో  ఆర్టిస్ట్ తెలియదు. అసలు హీరో ఎవరో కూడా తెలియదు. ఆ సినిమాని తెరకెక్కించిన దర్శకనిర్మాతలు కూడా తెలుగు ఆడియన్స్ కి పరిచయమే లేదు. కానీ పొగరు సినిమాని రష్మిక క్రేజ్ కి ముడిపెట్టేసి పబ్లిసిటీ చేసేస్తున్నారు. మరి రష్మిక చరిష్మా పొగరు కి ఎమన్నా ఓపెనింగ్స్ తీసుకొస్తాయో.. అసలు ఎంత కలెక్షన్స్ తెస్తుందో చూడాలి. 

Will Rashmika's charisma work?:

Rashmika starrer Pogaru release on feb 19th