Advertisementt

ప్రేమికుల రోజున ప్రేమ కథని బయటపెట్టింది

Sun 14th Feb 2021 01:09 PM
kajal agarwal,love story,gautam kitchlu,valentines day  ప్రేమికుల రోజున ప్రేమ కథని బయటపెట్టింది
The heroine who revealed her love story on Valentine's Day ప్రేమికుల రోజున ప్రేమ కథని బయటపెట్టింది
Advertisement
Ads by CJ

టాప్ హీరోయిన్, గ్లామర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ కెరీర్ లో ఓ స్టేజ్ కి చేరుకున్నాక అన్ని ప్లాన్ చేసుకుని పర్సనల్ లైఫ్ లో సెటిల్ అయ్యింది. తన ఫ్రెండ్ నే ప్రేమించి గత ఏడాది అక్టోబర్ లో పెళ్లి పీటలెక్కింది కాజల్. గౌతమ్ కిచ్లు తో ఏడేళ్ల స్నేహాన్ని ప్రేమ తో వివాహ బంధంగా మార్చుకుంది. పెళ్లి తర్వాత హాని మూన్ అంటూ హడావిడి చేసిన కాజల్ అగర్వాల్ ప్రస్తుతం చిరు ఆచార్య షూటింగ్ లో పాల్గొంటుంది. రీసెంట్ గా కాజల్ అగర్వాల్ నటించిన లైవ్ టెలికాస్ట్ వెబ్ సీరీస్ కూడా రిలీజ్ అయ్యింది. అయితే ఈ వాలంటైన్స్ డే రోజున తన భర్త గౌతమ్ తో తనకున్న ప్రేమ కథని రివీల్ చేసింది. తనను కాఫీ తాగేందుకు వస్తావా.. అని అడగడానికి గౌతమ్ కు రెండు రోజులు పట్టిందని.. అంతవరకూ అతనెవరో తనకు తెలియలేదని, కానీ తక్కువ టైమ్ లోనే తనకు మంచి ఫ్రెండ్ గా గౌతమ్ మారిపోయాడంటూ చెప్పుకొచ్చింది.

అప్పట్లో తనకి పెళ్ళైపై నమ్మకం ఉండేది కాదని.. ఆ విషయం గమనించిన గౌతమ్ తన కోసం ఇన్నాళ్లు వెయిట్ చేసాడని, మధ్యలో మేము ఫోన్ లోను, లెటర్స్ తోనూ మట్లాడుకునే వాళ్లమని, కరోనా టైం లో ఎవరి ఇంటికి వాళ్ళే పరిమితమైనప్పుడే మా మధ్యన ఉన్న ప్రేమని గుర్తించామని, లాక్ డౌన్ టైం లో మాస్క్ లతో ఓ దుకాణంలో కలిశామని అప్పుడే మా మధ్యన ప్రేమ ఎంతుందో ఆర్దమైందని.. నీతో కలిసి ఏడడుగులు నడిచి, జీవితాన్ని గడపాలని ఉంది అని గౌతమ్ తనకి ప్రపోజ్ చేసిన విధానం నచ్చడమే కాదు.. లైఫ్ లో ఇలాంటి వ్యక్తి మళ్ళీ దొరకడనిపించి వెంటనే వివాహం చేసుకున్నామంటూ తన ప్రేమ కథని ఈ వాలెంటైన్స్ డే సందర్భంగా రివీల్ చేసింది కాజల్. 

The heroine who revealed her love story on Valentine's Day:

Kajal shares about her love story with Gautam Kitchlu

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ