Advertisementt

పాగల్ ఓ మాస్ ప్రేమికుడు

Thu 18th Feb 2021 12:06 PM
vishwak sen,paagal movie,paagal teaser review  పాగల్ ఓ మాస్ ప్రేమికుడు
Paagal Teaser review పాగల్ ఓ మాస్ ప్రేమికుడు
Advertisement
Ads by CJ

విశ్వక్ సేన్ టాలీవుడ్ కి హీరోగా ఎంట్రీ ఇవ్వడమే మాస్ హీరోగా ఫ‌ల‌క్ నామా దాస్ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. తర్వాత నాని నిర్మాతగా తెరకెక్కిన హిట్ లో మాస్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా అదరగొట్టేసాడు. మరి మాస్ హీరోగానే ప్రాజెక్ట్ అవుతున్న విశ్వక్ సేన్ ఇప్పుడు ప్రేమతో అంటే లవ్ స్టోరీతో పాగల్ అంటున్నాడు. పాగల్ అంటే మరో మాస్ మూవీ అనుకుంటే పొరబాటే. పాగల్ లో విశ్వక్ సేన్ లుక్స్ కూల్ గానే ఉన్నా కేరెక్టర్ మాత్రం కాస్త వైల్డ్ గానే కనబడుతుంది. రీసెంట్ గా విడుదలైన పాగల్ టీజర్ లో లవర్ ఫేస్ లో హ్యాపీ నెస్ చూడాలంటూ తెగ కొట్టించేసుకుంటాడు విశ్వక్ సేన్.

రాహుల్ రామకృష్ణ ని నువ్వెంట్రా నా లవర్ ని సినిమాకి రమ్మంటున్నావ్ అంట అని విశ్వక్ అడిగితే.. రాహుల్ రామకృష్ణ కూడా ఓయ్ నేను సినిమాలు చూడ.. చెయ్యి చూసావా ఎంత రఫ్ గా ఉందో.. ఓన్లీ బిట్లు అనే డైలాగ్ తో పాగల్ టీజర్ ఎండ్ చేసారు. మరి విశ్వక్ సేన్ లవర్ బాయ్ లా, స్టైలిష్ లుక్స్ తో పాగల్ లో కనిపిస్తున్నా.. కేరెక్టర్ లో మాస్ లుక్స్ కనబడుతున్నాయి. లవర్.. లవర్.. అంటూ రొమాంటిక్ ప్రేమికుడిగా విశ్వక్ లుక్స్ అయితే బావున్నాయి. మరి మ్యూజికల్ గా కూడా పాగల్ కూల్ గానే కనబడుతుంది. న‌రేష్ కుప్పిలి ద‌ర్శ‌కత్వం వహిస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 30 న రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది. 

Paagal Teaser review:

Vishwak Sen Paagal Teaser Review 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ