Advertisementt

కొడాలికి కోర్టులో ఊరట.. కానీ..

Thu 18th Feb 2021 01:12 PM
sec,kodali nani,nimmagadda ramesh kumar,high court,media  కొడాలికి కోర్టులో ఊరట.. కానీ..
SEC vs Kodali కొడాలికి కోర్టులో ఊరట.. కానీ..
Advertisement
Ads by CJ

ఆంధ్రప్రదేశ్ స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో SEC నిమ్మగడ్డని ఎవ్వరూ అంటే వైసిపి మంత్రులు ఎవ్వరూ కేర్ చెయ్యడం లేదు. SEC నిమ్మగడ్డని నోటికొచ్చినట్లుగా మాట్లాడడం.. నిమ్మగడ్డ యాక్షన్ కి కోర్టులకి వెళ్లడం అనేది ఏపీ మంత్రులకి పరిపాటిగా మారిపోయింది. నిన్న పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి నిమ్మగడ్డ విషయంలో నోటికొచ్చినట్లుగా మాట్లాడగా నిమ్మగడ్డ పెద్దిరెడ్డిని మీడియాతో మాట్లాడడం కానీ, ఇంట్లో నుండి బయటికి రావద్దు అంటూ ఆంక్షలు విధించడం తర్వాత పెద్దిరెడ్డి కోర్టుకు వెళ్లి నిమ్మగడ్డపై పై చెయ్యి సాధించారు. నేడు కొడాలి నాని కూడా నిమ్మగడ్డ విషయంలో హై కోర్టుకు వెళ్లారు. అయితే ఆ తీర్పు లో నాని కి కాస్త అనుకూలంగా కాస్త ప్రతికాలంగా తీర్పు వచ్చింది.  

రీసెంట్ గా కొడాలి నాని మీడియా ముందు నిమ్మగడ్డ రమేష్ కుమర్ ని వ్యక్తిగతంగా విమర్శిస్తూ నోరు పారేసుకోగా.. కొడాలి నాని కి SEC షోకాజ్ నోటీసు జారీ చేసినా.. కొడాలి లో మార్పు లేకపోవడంత్రో SEC కొడాలి మీడియా తో మట్లాడకూడదంటూ ఆంక్షలు విధించిన సంగతి తెలిసిందే. నిమ్మగడ్డ పెట్టిన ఆంక్షలను సవాల్ చేస్తూ కోర్టుకి వెళ్లిన కొడాలి నానికి కోర్టులో కాస్త ఊరట లభించింది. నాని మీడియా తో మాట్లాడవచ్చని కానీ.. నిమ్మగడ్డ విషయంపై కానీ, ఎన్నికల ప్రక్రియపై మాట్లాడకూడదని ఈ ఆదేశాలను కొడాలి నాని ఖచ్చితంగా పాటించాలంటూ కోర్టు తీర్పునిచ్చింది.

SEC vs Kodali:

Kodali Nani gets relief from AP High Court

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ