Advertisementt

మోహన్ బాబు కి ఫైన్ వేసిన జీహెచ్ఎంసీ

Fri 19th Feb 2021 10:04 AM
mohan babu,ghmc,fined rs 1 lakh,illegal banner,house  మోహన్ బాబు కి ఫైన్ వేసిన జీహెచ్ఎంసీ
GHMC fined Mohan Babu మోహన్ బాబు కి ఫైన్ వేసిన జీహెచ్ఎంసీ
Advertisement
Ads by CJ

మంచు మోహన్ బాబు సన్ అఫ్ ఇండియా షూటింగ్ లో బిజీగా ఉంటున్నారు. రెండేళ్ల క్రితం రాజకీయాల్లోనూ కాస్త యాక్టీవ్ గానే ఉన్న మోహన్ బాబు ప్రస్తుతం ఆ విషయంలో సైలెంట్ గానే కనబడుతున్నారు. అయితే హైదరాబాద్ లోని ఫిలింనగర్ ఏరియా లో ఉన్న తన ఇంటి నుండి ఆయన తన ఫ్యామిలీతో పాటుగా శంషాబాద్ దగ్గరలో అన్ని హంగులతో నిర్మించిన ఇంటికి షిఫ్ట్ అయిన విషయం తెలిసిందే. అయితే ఇక్కడ ఫిలిం నగర్ ఇంటి దగ్గర ఎప్పటినుండో పెద్ద అడ్వర్టైజ్ మెంట్ బోర్డు ఒకటి ఉంటుంది. మంచు ఫ్యామిలీ కి సంబందించిన సినిమాల పోస్టర్స్ ఆ బోర్డు మీద దర్శనమిస్తుంటాయి. అయితే రీసెంట్ గా 15 అడుగుల ఎత్తులో ఉన్న ఆ బోర్డ్ పై కొందరు జీహెచ్ఎంసీ కి కంప్లైంట్ ఇచ్చారు.

కిందనుండి ఏకంగా 15 అడుగుల ఎత్తులో ఆ బోర్డు ఉందంటూ కంప్లైంట్ చెయ్యడంతో రంగంలోకి దిగిన జీహెచ్ఎంసీ అధికారులు.. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా ఇంటి ముందు ఇంత పెద్ద అడ్వర్టైజ్ మెంట్ బోర్డు పెట్టినందుకు గాను మోహన్ బాబు కి 1లక్ష రూపాయలు జరిమానా విధించారు. ఆ కంప్లైంట్ కి వెంటనే స్పందించిన అధికారులు మోహన్ బాబుకి 1లక్ష రూపాయలు జరిమానా విధించి ఆయనకు నోటీసులు అందచేసారు. అయితే ఈ విషయమై మోహన్ బాబు కానీ ఆయన ఫ్యామిలీ కానీ స్పందించాల్సి ఉంది. 

GHMC fined Mohan Babu:

Mohan Babu fined Rs 1 lakh over illegal banner in front of house

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ