Advertisementt

టాలీవుడ్ కి దొరకదేమో

Fri 19th Feb 2021 10:52 AM
pooja hegde,mumbai,new house,sea facing apartment,radhe shyam,acharya,bollywood  టాలీవుడ్ కి దొరకదేమో
Pooja Hegde keeping away from Tollywood టాలీవుడ్ కి దొరకదేమో
Advertisement
Ads by CJ

బాలీవుడ్ లో సక్సెస్ కాలేక టాలీవుడ్ మీద ఫోకస్ చేసిన పూజ హెగ్డే.. టాలీవుడ్ లో మాత్రం చాలా తక్కువ సమయంలోనే మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. టాలీవుడ్ లో వచ్చిన ప్రతి అవకాశం అంటే స్టార్ హీరో మూవీస్ లో హీరోయిన్ గా చేస్తూనే గెస్ట్ రోల్ అయినా, కాదు అంటే ఐటెం సాంగ్ కూడా వదలకుండా చేసి స్టార్ స్టేటస్ సంపాదించింది. టాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అలా వైవుకుంఠపురములో తర్వాత ప్రభాస్ తో పాన్ ఇండియా ఫిల్మ్ రాధేశ్యామ్ లో  నటిస్తున్న పూజ హెగ్డే ప్రస్తుతం బాలీవుడ్ మీద ఫోకస్ పెట్టింది. అక్కడ పలు సినిమాలతో పాప బాగా బిజీగా మారింది.

గ్లామర్ కి గ్లామర్, అందానికి అందంతో పూజ హెగ్డే బాలీవుడ్ కెరీర్ ఊపందుకుంది. అయితే బాలీవుడ్ లో బిజీ అవుతున్న తరుణంలో రామ్ చరణ్ సరసన ఆచార్య ఒప్పుకున్న పూజ హెగ్డే ఇప్పుడు ముంబై లో ఓ ఇల్లు కొనేసింది అనే వార్త టాలీవుడ్ ప్రేక్షకులను కలవరపెడుతుంది. ముంబై లో ఇల్లు కొని అక్కడే పాగా వేస్తుందా? అనే ఆందోళనలో పూజ తెలుగు అభిమానులు ఉండిపోయారు. ముంబై లోని ఖరీదైన ప్రాంతం బాంద్రాలో ఖరీదైన మూడు బెడ్రూమ్‌లున్న కొత్త ఫ్లాట్‌ను కొనుగోలు చేసింది పూజా హెగ్డే. అయితే ఈ ఫ్లాట్ కాస్ట్లీ నే కాదు.. ఈ ఫ్లాట్ కున్న మరో విశేషం అది సముద్రానికి ఎదురుగా ఉండటం. అంతేకాదండోయ్ ఆ ఇంటికి సంబందించిన ఇంటీరిల్ డిజైన్ ను పూజా హెగ్డే దగ్గరుండి మరీ సెలెక్ట్ చేసిందట. కోట్లు పెట్టి కొన్నఈ ఫ్లాట్ లో పూజ హెగ్డే గృహ ప్రవేశం కూడా చేసేసింది. మరి ముంబై ఎయిర్ పోర్ట్ కి దగ్గరలో ఉన్న ఈ ఫ్లాట్ తో పూజ హెగ్డే ముంబైలోనే సెటిల్ అవుతుందో.. లేదంటే అప్పుడప్పుడు టాలీవుడ్ కి అవకాశం ఇస్తుందో చూడాలి.

Pooja Hegde keeping away from Tollywood:

​Pooja Hegde Buys a Sea facing Apartment in Mumbai

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ