యాక్షన్ హీరో గోపీచంద్ - సంపత్ నంది కాంబోలో తెరకెక్కుతున్న సీటిమార్ షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. ఎందుకంటే సీటిమార్ ని ఏప్రిల్ 2 న రిలీజ్ చేస్తున్నట్లుగా డేట్ కూడా ప్రకటించారు. ప్రస్తుతం షూటింగ్ చివరి అంకంలో ఉన్న సీటిమార్ లో తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. సీటిమాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతుంది. మిల్కి బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో ఓ ఐటెం సాంగ్ కోసం రామ్ గోపాల్ వర్మ హీరోయిన్ ని సీటిమార్ టీం సంప్రదించడం ఆ హీరోయిన్ ఓకె చెప్పడం కూడా జరిగిపోయినట్లుగా తెలుస్తుంది.
రామ్ గోపాల్ వర్మ తో రచ్చ చేస్తూ.. లాక్ డౌన్ టైం లో సోషల్ మీడియాలో బాగా యాక్టీవ్ గ ఉన్న అప్సర రాణి గోపీచంద్ సీటిమార్ లో ఐటెం సాంగ్ చేసే ఛాన్స్ దక్కించుకుంది. భూమ్ బద్దలు భూమ్ బద్దల్ అంటూ రవితేజ తో క్రాక్ సినిమాలో ఐటెం సాంగ్ లో ఆడిపాడింది ఈ అప్సర రాణి. ఆ సినిమా హిట్ అవడంతో అప్సర రాణికి ఇప్పుడు మరో అవకాశం తలుపుతట్టింది. అదే గోపీచంద్ - సంపత్ నంది కాంబోలో వస్తున్నా సీటిమార్ లో అప్సర రాణికి ఐటెం సాంగ్ చేసే అవకాశం దక్కింది. మరి గ్లామర్ బ్యూటీ తమన్నాతో పాటుగా హాట్ బ్యూటీ అప్సర రాణి ఐటెం సాంగ్ చెయ్యడం అంటే గోపీచంద్ సినిమాకి మరింత హైప్ పెరగడం ఖాయం.