బాలకృష్ణ - బోయపాటి BB3 షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో శరవేగంగా జరుగుతుంది. బాలకృష్ణ BB3 ని తొందరగా కంప్లీట్ చేసేసి గోపీచంద్ మలినేని దర్శకత్వంలో చెయ్యబోయే మాస్ ఎంటర్టైనర్ కోసం రెడీ కావడమే కాకుండా అటు రాజకీయాల్లోనూ ఫుల్ యాక్టివ్ గా మారాలనుకుంటున్నారు. అందుకే విరామమే అన్నది లేకుండా బోయపాటి సినిమా షూటింగ్ ఫినిష్ చేసే పనిలో బిజీగా వున్నారు. BB3 మే 28 న రిలీజ్ చేస్తున్నట్టుగా డేట్ ప్రకటించారు. అయితే ఇప్పటివరకు BB3 టైటిల్ విషయం అటు బోయపాటి కానీ ఇటు బాలయ్య కానీ బయటపెట్టడం లేదు. మధ్యలో సోషల్ మీడియాలో బాలయ్య - బోయపాటి BB3 కి మోనార్క్ టైటిల్ ని ఫిక్స్ చేసేశారంటూ ప్రచారం జరిగింది.
అయితే తాజాగా బోయపాటి - బాలయ్య BB3 టైటిల్ ఫిక్స్ అయినట్లుగా తెలుస్తుంది. BB3 లో బాలయ్య నట విశ్వరూపం చూపించబోతున్నాడని.. కాబట్టి గాడ్ ఫాదర్ గా BB3 టైటిల్ ని బోయపాటి ఫిక్స్ చేసినట్లుగా చెబుతున్నారు. అంటే గాడ్ ఫాదర్ గా గర్జించనున్న నటసింహం అంటూ నందమూరి అభిమానులు అప్పుడే పండగ చేసుకుంటున్నారు. ఇప్పటికే BB3 టీజర్ BB3 పై మంచి హైప్ క్రియేట్ చెయ్యగా.. ఇప్పుడు ఈ మాస్ టైటిల్ తో సినిమాపై మరింత క్రేజ్ పెరగడం ఖాయంగానే కనబడుతుంది. ఇక BB3 టైటిల్ ని అంటే గాడ్ ఫాదర్ టైటిల్ ని అధికారికంగా టీం త్వరలోనే ప్రకటించనున్నట్లుగా తెలుస్తుంది.