Advertisementt

కరెక్ట్ గా వాడితే రిజల్ట్ ఇలా ఉంటుంది

Sat 20th Feb 2021 08:14 AM
varalakshmi sarathkumar,aadhya,naandhi movie,allari naresh  కరెక్ట్ గా వాడితే రిజల్ట్ ఇలా ఉంటుంది
If used correctly, the result is as follows కరెక్ట్ గా వాడితే రిజల్ట్ ఇలా ఉంటుంది
Advertisement
Ads by CJ

కోలీవుడ్ యాక్ట్రెస్ వరలక్ష్మి శరత్ కుమార్ కొన్ని సినిమాల్లో హీరోయిన్ గా నటించినా.. ప్రస్తుతం ఆమె నెగటివ్ కేరెక్టర్స్ కి, ఇంకా కీలక పాత్రలకి టర్న్ అయ్యింది. స్టార్ హీరోస్ మూవీస్ లో లేడి విలన్ గాను వరలక్ష్మి అదరగొట్టేస్తుంది. అయితే వరలక్ష్మి ఆహార్యానికి, ఆమె పవర్ ఫుల్ లుక్స్ కి ఆమెకి గనక మంచి పాత్ర తగిలితే ఎంతలా పెరఫార్మెన్సు చూపిస్తుందో అనేది రీసెంట్ గా రిలీజ్ అయిన నాంది సినిమానే ఉదాహరణ. గతంలో వరలక్ష్మి శరత్ కుమార్ నెగెటివ్ షేడ్స్ ఉన్న కేరెక్టర్స్ విజయ్ సర్కార్ లోను, విశాల్ పందెం కోడి సినిమాల్లో నటించింది. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ కేరెక్టర్ ని పవర్ ఫుల్ గా చూపించినా.. ఆ సినిమాల టాక్ వలన ఆమె పెరఫార్మెన్స్ మరుగున పడిపోయింది.

ఇంకా తెలుగులోనూ తెనాలి రామకృష్ణ ఎల్ ఎల్ బిలో నటించింది. రీసెంట్ గా క్రాక్ సినిమాలోనూ వరలక్ష్మి నటించింది. అయితే ఆ సినిమాల్లో వరలక్ష్మి పాత్రకి గాని ఆమె లుక్స్ కి కానీ మంచి మార్కులు పడలేదు. కానీ అల్లరి నరేష్ నాంది సినిమాలో జూనియర్ లాయర్ ఆద్యగా వరలక్ష్మి నట విశ్వరూపాన్ని ఫుల్ మార్క్స్ పడుతున్నాయి. అల్లరి నరేష్ పాత్ర కన్నా వరలక్ష్మి ఆద్య పాత్రకే ప్రేక్షకులు విజిల్స్ వేస్తున్నారు. నాంది సినిమాలో ఆద్య గా కోర్టులో వరలక్ష్మి పెరఫార్మెన్స్ నిజంగా అద్భుతం. సినిమాకే సూపర్ హైలెట్ అంటూ కాంప్లిమెంట్స్ ఇస్తున్నారు. మరి మంచి నెగెటివ్, పవర్ ఫుల్ లుక్స్ ఉన్న వరలక్ష్మిని కరెక్ట్ గా వాడితే.. ఇలా నాంది లాంటి రిజెల్ట్స్ వస్తాయనడంలో ఎలాంటి సందేహం లేదు.

If used correctly, the result is as follows:

Varalakshmi Sarathkumar as Aadhya in Naandhi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ