కొరటాల శివ - చిరంజీవి కాంబోలో మొదలైన ఆచార్య సినిమా షూటింగ్ శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటుంది. మే 13 న ఆచార్య రిలీజ్ డేట్ ప్రకటించడం, ఇప్పటికే రామ్ చరణ్ సిద్ధగా ఆచార్య షూటింగ్ లో అడుగు పెట్టడమే కాకుండా ఆచార్య బిజినెస్ కూడా జోరందుకుంది. ప్రస్తుతం ఆచార్య షూటింగ్ మారేడుమిల్లి ఫారెస్ట్ లో జరుగుతున్న విషయం తెలిసిందే. గత వారం రోజులుగా రామ్ చరణ్ పై అక్కడ అటవీ ప్రాంతంలో కీలకమైన సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది. ఇక మార్చ్ ఫస్ట్ వీక్ లో రామ్ చరణ్ పక్కన హీరోయిన్ గా చెయ్యబోతున్న పూజ హెగ్డే కూడా ఆచార్య షూటింగ్ లో పాల్గొనబోతుంది.
ఈ రోజు అదివారం మెగాస్టార్ చిరు కూడా ఆచార్య షూటింగ్ కోసం మారేడుమిల్లి ఫారెస్ట్ కి ఎంటర్ అయ్యారు. రాజమండ్రి ఎయిర్ పోర్ట్ నుండి మారేడుమిల్లి వెళ్లే రోడ్డు మార్గంలో ఫాన్స్ చిరూ ని చూసేందుకు వచ్చిన ఫొటోస్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. సోమవారం నుండి చిరు - రామ్ చరణ్ కాంబోలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాల చిత్రీకరణ మొదలు పెట్టబోతున్నాడు కొరటాల శివ. ఆచార్య గా చిరు - సిద్ద గా రామ్ చరణ్ కాంబో సీన్స్ మొదలు కాబోతున్నాయి. మరి ఆచార్య గా చిరు, సిద్ధగా రామ్ చరణ్ ఎలాంటి పెరఫార్మెన్స్ ఇస్తారో.. త్రండ్రి కొడుకులు స్క్రీన్ షేరింగ్ ఎలా ఉండబోతుందో అనే క్యూరియాసిటిలో మెగా ఫాన్స్ ఉన్నారు. ముఖ్యంగా కొరటాల శివ ఆచార్య, సిద్దా కేరెక్టర్స్ ని ఎలా డిజైన్ చేసారో అనే ఇంట్రెస్ట్ జనంలో రోజు రోజుకీ ఎక్కువైపోతూ సినిమాపై క్రేజుని పెంచేస్తోంది.