నెట్ ఫ్లిక్స్ గత ఏడాది సెన్సేషన్ క్రియేట్ చేసిన వెబ్ సిరీస్ లస్ట్ స్టోరీస్. ఒక్కసారిగా కియారా అద్వానీ లాంటి అమ్మాయి కూడా తనలోని హాట్ నెస్ ని బయటికి తీసుకొచ్చి.. ఓవర్ ది నైట్ ఎక్కడ లేని క్రేజ్ తెచ్చేసుకుంది ఆ లస్ట్ స్టోరీస్ సీరిస్ తో. హిందీలో లస్ట్ స్టోరీస్ పెద్ద హిట్ అవడంతో మిగతా లాంగ్వేజెస్ లోను ఆ వెబ్ సీరీస్ తీద్దామని ట్రై చేసింది నెట్ ఫ్లిక్స్. అలాగని ఇతర భాషల్లో ఆషామాషీగా తీయలేదండోయ్.. చాలా పెద్ద సెటప్ నే సిద్ధం చేసింది. నాలుగు కథలకి నలుగురు క్రేజీ డైరెక్టర్స్ ని సెలెక్ట్ చేసి ఆ వెబ్ సీరీస్ కి పిట్ట కథలు అని పేరు పెట్టారు.
పెళ్లి చూపులు లాంటి క్రేజీ ఫిలిం చేసిన తరుణ్ భాస్కర్, మహానటి లాంటి అవార్డు ఫిల్మ్ చేసిన నాగ్ అశ్విన్, అలామొదలైంది లాంటి మూవీ చేసిన నందిని రెడ్డి, ఘాజి లాంటి సినిమా చేసిన సంకల్ప్ రెడ్డి లాంటి మంచి డైరెక్టర్స్ ని సెలెక్టీవ్ గా తీసుకుని వాళ్లతో నెట్ ఫ్లిక్స్ చాలా భారీగానే పిట్ట కథలను మొదలు పెట్టారు. అలాగే నటీనటుల విషయంలోనూ కాంప్రమైజ్ కాలేదు. శృతి హాసన్, అమల పాల్, లక్ష్మి మంచు, జగపతి బాబు, ఈషా రెబ్బ, సత్య దేవ్ ఇలా భారీ తారాగణంతోనే పిట్ట కథలను తెరకెక్కించారు. అయితే ప్యాకేజ్ ఎంత బావున్నా కూడా.. లోపల మేటర్ లేదనే విషయం పిట్టకథలు ఆన్ లైన్ లోకి వచ్చిన రోజే కనిపెట్టేసింది మన క్రేజీ యూత్.
అందుకే నెట్ ఫ్లిక్స్ వాళ్ళు ఎక్సపెక్ట్ చేసిన రిజల్ట్ ఇక్కడ రాలేదు. మన డైరెక్టర్స్ అనుకున్న రెస్పాన్స్ అయితే అసలు ఆ దరిదాపుల్లోకి కూడా వెళ్ళలేదు పిట్ట కథలు సీరీస్. ప్యాకేజ్ ఎంత బాగుంటే ఏంటి యూజ్