వైష్ణవ తేజ్ - కృతి శెట్టి.. హీరో - హీరోయిన్స్ గా బుచ్చి బాబు సనా దర్శకత్వంలో మైత్రి మూవీస్ వారు తెరకెక్కించిన ఉప్పెన సినిమా ఎంత పెద్ద హిట్టో ఉప్పెన కలెక్షన్స్ చూస్తేనే తెలుస్తుంది. సుకుమార్ శిష్యుడిగా బుచ్చి బాబు దర్శకత్వానికి, వైష్ణవ తేజ్ నటన, కృతి శెట్టి అందం, అభినయం, విజయ్ సేతుపతి నటనకు అందరూ ఫిదా అవుతున్నారు. ఉప్పెన బ్లాక్ బస్టర్ కలెక్షన్స్ కి తోడు ఆ సినిమా పబ్లిసిటీ.. అలాగే స్టార్ హీరోల బ్లెస్సింగ్స్ అన్ని ఉప్పెనకి బాగా కలిసొస్తున్నాయి. ఇక ఉప్పెన సినిమా విడుదలవ్వడమే సూపర్ స్టార్ మహేష్ దుబాయ్ లో సర్కారు వారి పాట షూటింగ్ లో ఉండి ఉప్పెన టీం కి బెస్ట్ విషెస్ తెలియజేసాడు.
ఇక రీసెంట్ గా ఉప్పెన సినిమా చూసిన మహేష్ ఉప్పెన సినిమా గురించి ఒక్క మాటలో చెప్పాలంటే.. క్లాసిక్ అంటూ ఉప్పెన సినిమాపై ప్రశంశల వర్షం కురిపించాడు. ఎప్పటికి మర్చిపోలేని అరుదైన సినిమా ఉప్పెన చేసావు అంటూ డైరెక్టర్ బుచ్చి బాబు సనాని మహేష్ అభినందించాడు. అలాగే హీరో హీరోయిన్స్ వైష్ణవ తేజ్ - కృతి శెట్టి ని మనసుని స్పృశించే నటనతో ఆకట్టుకున్నారు.. మీరిద్దరు ఈ సినిమాకి స్టార్స్ అంటూ.. మ్యూజిక్ డైరెక్టర్ దేవీశ్రీని ప్రత్యేకంగా అభినందించాడు మహేష్. ఉప్పెన సినిమాకి దేవిశ్రీ మ్యూజిక్ గుండె లాంటిది.. దేవిశ్రీ ఇచ్చిన ట్యూన్స్ గ్రేట్ అంటూ దేవి మ్యూజిక్ ని పొగిడేసాడు. ఫైనల్ గా దర్శకుడు సుకుమార్, మైత్రి మూవీస్ వారికీ ఇలాంటి మంచి సినిమా నిర్మించినందుకు గర్వంగా ఉంది అంటూ హాట్స్ హాఫ్ చెప్పాడు మహేష్.
మహేష్ ఉప్పెన సినిమాని పొగుడుతూ ట్వీట్ చెయ్యడంతో కృతి శెట్టి రీ ట్వీట్ చేస్తూ.. థాంక్యూ మహేష్ సర్. మా టీం హార్డ్ వర్క్ మరియు సహనం అన్ని ఇప్పటికి ఫలించాయి. మీ రెస్పాన్స్ చూసి మనసు నిండిపోయింది. సూపర్ స్టార్ స్వయంగా ఈ ట్వీట్ పెట్టినందుకు చాలా గర్వంగా ఉంది అంటూ మహేష్ కి మరోసారి థాంక్స్ చెప్పింది.