విజయ్ దేవరకొండ - పూరి జగన్నాధ్ కాంబోలో పాన్ ఇండియా ఫిలిం గా తెరకెక్కుతున్న లైగర్ సినిమా షూటింగ్ ముంబై పరిసర ప్రాంతాల్లో జరగుతుంది. అయితే ఇప్పుడు బాలీవుడ్ లో అంటే ముంబై అడ్డాగా జరుగుతూన్న లైగర్ షూటింగ్ ముచ్చట్ల కన్నా ఎక్కువగా విజయ్ దేవరకొండ బాలీవుడ్ స్నేహాలు, అలాగే లైగర్ సెట్స్ లో కో నిర్మాత ఛార్మి చేసే అల్లరి, హడావిడి, విజయ్ దేవరకొండ - అనన్య పాండే లు లైగర్ సాంగ్ రిహార్సల్స్ ఫొటోస్ అంటూ అబ్బో లైగర్ ముచ్చట్లు ఓ రేంజ్ లో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇక లైగర్ సినిమా లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఓ డాన్ కొడుకుగా కనిపించబోతున్నాడనే న్యూస్ ఉంది. అలాగే విజయ్ దేవరకొండ తల్లిగా రమ్యకృష్ణ నటించబోతున్న విషయం తెలిసిందే.
అయితే ప్రస్తుతం లైగర్ గా విజయ్ దేవరకొండ ఎలా ఉంటాడో ఫస్ట్ లుక్ లోనే చూసేసాం. ఇక మిగతా కేరెక్టర్స్ ఎలా ఉండబోతున్నాయి ఎవరికీ ఐడియా కూడా లేదు. కానీ ప్రస్తుతం విజయ్ దేవరకొండ రమ్యకృష్ణ లైగర్ లొకేషన్స్ లో దిగిన ఫోటో ఇప్పుడు లైగర్ లో రమ్యకృష్ణ లుక్ ఎలా ఉండబోతుందో రివీల్ చేసేసింది. ఓ సాదా సీదా తల్లి పాత్రలో రమ్యకృష్ణ లైగర్ లో కనిపించబోతుంది అనేది రమ్యకృష్ణ లుక్, గెటప్ చూస్తే తెలుస్తుంది. మరి లైగర్ తో రమ్యకృష్ణ పిక్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.