ఉప్పెన సినిమాలో బేబమ్మగా తెలుగు తెరకు పరిచయమైన కృతి శెట్టి ఇప్పుడు టాలీవడ్ యంగ్ హీరోస్ కి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ లా అయ్యిపోయింది. ఉప్పెన సినిమాలో బేబమ్మగా కృతి శెట్టి నటనకు హీరోలు అందరూ ఫిదా అవుతున్నారు. అసలు సినిమా విడుదల కాకుండానే కృతి శెట్టి కోసం ఆఫర్స్ క్యూ కట్టాయి. ఉప్పెన సినిమా రిలీజ్ అవ్వకుండానే నాని, సుధీర్ బాబు తమ సినిమాల్లో కృతి శెట్టికి ఆఫర్స్ ఇచ్చి లాక్ చేసేసారు. ఇక సినిమా విడుదలయ్యాక పాప పెరఫార్మెన్స్ కి మరీ ముగ్దులవుతున్నారు. ఒకే ఒక్క సినిమాతో అందరి చూపు తన వైపే తిప్పుకున్న కృతి శెట్టి పారితోషకం విషయంలో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ మొదలయ్యింది.
ఉప్పెన సినిమాకి బేబమ్మ కేవలం 6 లక్షలు మాత్రమే అందుకుంది. మరి మైత్రి వారు కొత్త పిల్లని 6 లక్షలకు బాగానే పట్టుకొచ్చారు. కానీ ఇప్పుడు బేబమ్మ రేంజ్ 60 లక్షలట. అంటే ఇక ముందు అమ్మడు ఒప్పుకోబోయే సినిమాలకు ఆ రేంజ్ పారితోషకం కృతి శెట్టి డిమాండ్ చేస్తుందట. ఇప్పటికే అర కోటికి ఫిక్స్ అవుతున్న నిర్మాతలు కృతి శెట్టి క్రేజ్ ని వాడుకోవడానికి 60 లక్షలు ఇచ్చేందుకు సిద్దమవుతున్నారనే టాక్ మొదలైంది. ఉప్పెన సినిమా దెబ్బకి ఓవర్ నైట్ స్టార్ డం దక్కించుకున్న కృతి శెట్టి ఉప్పెనకి చాలా తక్కువ పారితోషకం అందుకున్నా ఇప్పుడు మాత్రం తనకొచ్చిన క్రేజ్ కి సరిపోయే పారితోషకం డిమాండ్ చేస్తుందట.