టాలీవుడ్ లో దువ్వాడ జగన్నాధం తో దున్నేసిన పూజ హెగ్డే ఆ తర్వాత తెలుగు స్టార్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది. సూపర్ స్టార్ మహేష్ దగ్గర నుండి యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రభాస్, రామ్ చరణ్, అల్లు అర్జున్ ఇలా స్టార్స్ హీరోస్ అందరిని చక్కబెట్టేసింది. పూజ హెగ్డే నెంబర్ వన్ అవుతుంది అనుకునేలోపు పూజకి పోటీకి దిగేసింది కన్నడ బ్యూటీ రష్మిక మందన్న. ఛలో అంటూ చిన్నగా టాలీవుడ్ లోకి అడుగుపెట్టి చాపకింద నీరులా స్టార్ అవకాశాలు పట్టేసింది. ఒకొనొక టైములో రష్మిక vs పూజ అన్న రేంజ్ లో వాళ్ళ మధ్యన కాంపిటీషన్ నడిచింది. ప్రస్తుతం కూడా పూజ హెగ్డే ఎక్కడికి వెళితే అక్కడికి అన్నట్టుగా రష్మిక ప్రయాణం ఉంది.
ప్రభాస్ తో పాన్ ఇండియా మూవీ చేస్తున్న పూజ హెగ్డే కి పోటీగా అల్లు అర్జున్ తో పుష్ప పాన్ ఇండియా ఫిల్మ్ చేస్తుంది రష్మిక. అలా వైకుంఠపురములో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాక బాలీవుడ్ మూవీస్ తో పూజ హెగ్డే బిజీ అయ్యింది. రష్మిక కూడా బాలీవుడ్ లోకి అడుగుపెట్టి మూడు సినిమాలతో బిజీ అయ్యింది. మరోపక్క పూజ హెగ్డే ముంబై లో కాస్ట్లీ ప్లేస్ లో త్రీ బెడ్ రూమ్ ఫ్లాట్ కొంటే.. రీసెంట్ గా రష్మీకి కుడా ముంబైలో ఇల్లుకొనేసింది అనే టాక్ మొదలైంది. ప్రస్తుతం టాలీవుడ్, బాలివుడ్, తమిళ మూవీస్ తో బిజీగా వున్న రష్మిక ముంబై షూటింగ్ కి వెళ్ళినప్పుడల్లా హోటల్ లో రూమ్ తీసుకుని ఉంటుందట. అదంతా ఎందుకు మనకి ఓ ఇల్లు ముంబైలో ఉంటే బావుంటుంది అని అనుకుందట రష్మిక.
రష్మిక ముంబై లో ఖరీదైన ప్రాంతంలో విలాసవంతమైన ఫ్లాట్ ను కొనుగోలు చేసినట్లుగా బాలీవుడ్ మీడియా కోడై కూస్తుంది. ఇంతకుముందే హైదరాబాద్ లో ఇంటిని కొనుగోలు చేసిన రష్మిక ఇప్పుడు ముంబై లోనూ కొత్తిల్లు కొనేసిందట. మరి ఇదంతా గమనిస్తే పూజ హెగ్డే ఎక్కడికి వెళితే అక్కడికి రష్మిక పోటీకి వెళుతున్నట్టే కనిపించడం లేదూ.