Advertisementt

పెళ్లి తర్వాత జరగాల్సింది.. ముందే జరిగిపోతే..

Fri 26th Feb 2021 06:23 PM
thellavarithe guruvaram movie,simha koduri,kala bhairava music,teaser  పెళ్లి తర్వాత జరగాల్సింది.. ముందే జరిగిపోతే..
Thellavarithe Guruvaram teaser review పెళ్లి తర్వాత జరగాల్సింది.. ముందే జరిగిపోతే..
Advertisement
Ads by CJ

మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి తనయుడు సింహ కోడూరి మత్తువదలరా సినిమాతో అందరిని కామెడీగా మెస్మరైజ్ చేసాడు. కమెడియన్ సత్య తో సింహ కోడూరి చేసిన కామెడీ మత్తువదలరా సినిమాని హిట్ చేసింది. అలాగే కాల భైరవ మ్యూజిక్ కూడా మత్తువదలరా హిట్ లో భాగస్వామే. సింహ కోడూరి తాజా చిత్రం తెల్లవారితే గురువారం సినిమా కూడా కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్ గానే కనిపిస్తుంది. తాజాగా మెగా హీరో వరుణ్ తేజ్ చేతుల మీదుగా తెల్లవారితే గురువారం టీజర్ రిలీజ్ అయ్యింది. మత్తు వదలరా సినిమాలో గెడ్డంతో కాస్త రఫ్ లుక్ లో కనబడిన సింహ కోడూరి తెల్లవారితే గురువారంలో మాత్రం కాస్త స్టయిలిష్ గాను మోడ్రెన్ గాను కనిపిస్తున్నాడు. ఇక ఈ సినిమాలోనూ సత్య.. సింహ కి ఫ్రెండ్ కేరెక్టర్ చేసాడు.

సింహ - సత్య మధ్యన సాగె కామెడీ ట్రాక్ బావుంది. సింహ నాకు పెళ్లి ఇష్టం లేదు అంటే.. పెళ్లి తర్వాత జరగాల్సినవి పెళ్ళికి ముందే జరిగిపోతే నీకు ఈ పెళ్లంటే ఎందుకు ఇష్టం ఉంటుంది అని సత్య చెప్పే డైలాగ్ ఫన్నీగా ఉంది. హీరోయిన్ కి కథ చెబుతున్నట్టుగా తన జీవితం గురించి చెబుతున్న సింహ నువ్వు నా గురించి చాలా ఎక్సపెక్ట్ చేస్తున్నావ్ మగధీర కాదిక్కడ మర్యాదరామన్న.. అంటూ సింహ చెప్పే డైలాగ్ ఆకట్టుకునేలా ఉంది. వైవా హర్ష, మిషా నారంగ్, చిత్ర శుక్ల అందరూ చాలా డీసెంట్ పాత్రలు చేశారనిపిస్తుంది టీజర్ చూస్తుంటే. కాల భైరవ మ్యూజిక్ అద్భుతంగా ఉంది.

Click Here to: Thellavarithe Guruvaram teaser

Thellavarithe Guruvaram teaser review:

Varun tej launches >Thellavarithe Guruvaram teaser

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ