Advertisementt

డైరెక్టర్ అడిగినా డీ గ్లామర్ గా చెయ్యనందట

Sat 27th Feb 2021 05:01 PM
meena,drishyam 2 movie,mohan laal,meena de - glamour role,trolled,make-up,jeethu joseph reacts  డైరెక్టర్ అడిగినా డీ గ్లామర్ గా చెయ్యనందట
Meena who will not do de - glamour role if asked by the director డైరెక్టర్ అడిగినా డీ గ్లామర్ గా చెయ్యనందట
Advertisement
Ads by CJ

మలయాళంలో రీసెంట్ గా అమెజాన్ ప్రైమ్ లో నేరుగా స్ట్రీమింగ్ అయిన దృశ్యం 2 ఎంత పెద్ద హిట్ అయ్యిందో తెలిసిన విషయమే. మోహన్ లాల్ నటన సినిమాకి ఆయువు పట్టు. జీతూ జోసెఫ్ దర్శకత్వం, బ్యాగ్ రౌండ్ మ్యూజిక్ అన్ని సినిమాని సక్సెస్ తీరానికి నడిపించాయి. ఇప్పుడు అదే దృశ్యం 2 ని దర్శకుడు జీతూ జోసెఫ్ తెలుగులో వెంకటేష్ హీరోగా రీమేక్ చెయ్యబోతున్నారు. ఇక దృశ్యం 1 ఎంత పెద్ద హిట్టో దృశ్యం 2 అంతే పెద్ద హిట్ అవడంతో ఇప్పుడు తెలుగు రీమేక్ పై అంచనాలు పెరిగిపోయాయి. అయితే దృశ్యం 2 సినిమాలో మీనా లుక్స్ పై చాలా ట్రోల్స్ వచ్చాయి. సెన్సిటివ్ అండ్ ఎమోషనల్ సన్నివేశాల్లోనూ మీనా గ్లామర్ గానే అంటే మేకప్, లిప్ స్టిక్ తో కనిపించింది. దానిపై చాలామంది ఇలాంటి ఎమోషనల్ సీన్స్ లో.. అందులోనూ ఇద్దరు పిల్లల తల్లిగా అలా మేకప్ తో మీనా కనిపించడం, పెద్ద కూతురు కన్నా మీనా ఇంకాస్త యంగ్ గా కనిపించడంపై చాలా ట్రోల్ చేసారు.

అయితే ఈ ట్రోల్స్ పై జీతూ జోసెఫ్ స్పందించారు. ఆ ట్రోల్స్ విషయం నేనూ ఒప్పుకుంటాను. నేను ఆల్రెడీ మీనా గారిని కి చేప్పాను నో మేకప్ లుక్ కావాలి.. డీ గ్లామర్ గా కనిపించాలి అని. కానీ మీనా మాత్రం డీ గ్లామర్ గా కనిపించేందుకు ఒప్పుకోలేదు. తాను మేకప్ లేకుండా నటించలేనని చెప్పడంతో.. చేసేది లేక ఆలా చెయ్యాల్సి వచ్చింది.. ఇంతకు ముందు దృశ్యం 1 విషయంలోనూ మీనా లుక్ పై ట్రోల్స్ వచ్చాయి అని మీనా గారికి వివరించినా ఆమె ససేమిరా అనడం, ఇక లుక్ ఎలా ఉన్నా పెరఫార్మెన్స్ కే ఇంపార్టెన్స్ ఇచ్చే తాను చివరికి ఒప్పుకోక తప్పలేదని మీనా లుక్స్ పై వస్తున్న ట్రోల్స్ కి వివరణ ఇచ్చారు జీతూ.

Meena who will not do de - glamour role if asked by the director:

Meena Gets Trolled For Her Make-Up In The Movie; Jeethu Joseph Reacts

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ