100 పెర్సెంట్ లవ్ అనే షో యాక్టర్, యూట్యూబ్ ని ఫాలో అయ్యేవారు, గత బిగ్ బాస్ లో పార్టిసిప్ఎట్ చేసిన దీప్తి సునయన కి బాయ్ ఫ్రెండ్ షణ్ముఖ్ జస్వంత్ అంటే తెలియని వారుండరు. ప్రస్తుతం షణ్ముఖ్ జస్వంత్ బుల్లితెర మీదకి కూడా వచ్చేసాడు. సుమ క్యాష్ ద్వారా బుల్లితెరకు వచ్చిన షణ్ముఖ్ జస్వంత్ ఇప్పుడు స్టార్ మా లో ప్రసారం కాబోతున్న 100 పెర్సెంట్ లవ్ అనే షో కి దీప్తి సునయన బాయ్ ఫ్రెండ్ గా అందరికి పరిచయం అయ్యాడు. యూట్యూబ్ లో అలాగే సోషల్ మీడియాలో, డాన్స్ వీడియోస్ తోనూ, షార్ట్ ఫిలిమ్స్ తో బాగా ఫెమస్ అయిన షణ్ముఖ్ జస్వంత్ కి విపరీతమైన యూత్ ఫాలోయింగ్ ఉంది. సాప్ట్ వేర్ డెవలపర్ అనే వెబ్ సీరీస్ తో పాపులర్ అయిన షణ్ముఖ్ ఇప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో పట్టుబడడం కలకలం రేపుతోంది.
చూడడానికి అమాయకంగా కనబడే ఈ షణ్ముఖ్ జస్వంత్ అతిగా మద్యం సేవించి కారు నడుపుతూ.. జూబ్లీహిల్స్ ఏరియా లో యాక్సిడెంట్ చేసి పలు వాహనాలు ఢీ కొట్టడంతో అతనిపై కేసు నమోదు చేసారు పోలీస్ లు. షణ్ముఖ్ జస్వంత్ ఢీ కొట్టిన వాటిలో కార్లు, బైక్స్ ఉన్నాయని సమాచారం. అయితే సమాచారం అందుకున్న పోలీస్ లు వెంటనే సంఘటన స్థలానికి చేరుకొని షణ్ముఖ్ జస్వంత్ ని అదుపులోకి తీసుకుని బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చెయ్యగా.. మోతాదుకు మించి షణ్ముఖ్ జస్వంత్ మద్యం తీసుకుని.. అదుపు తప్పి ఆక్సిడెంట్ చేసినట్లుగా నిర్ధారణకు వచ్చిన పోలీస్ లు షణ్ముఖ్ జస్వంత్ కారు సీజ్ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.