అల్లు అర్జున్ అభిమానుల ముందుకు వచ్చింది.. అలా వైకుంఠపురములో, ఆహా వన్ ఇయర్ యానవర్సికి తప్ప మళ్ళీ అల్లు అర్జున్ దర్శనం ఫాన్స్ కి కలగలేదు. అయితే పుష్ప లీకెడ్ వీడియోస్, లీకెడ్ ఫొటోస్ లో కనిపించడమే తప్ప.. అల్లుఅర్జున్ దర్శనం మళ్ళీ అభిమానులకి కలగలేదు. ఉప్పెన అంత పెద్ద హిట్ అయ్యి మెగా కాంపౌండ్ లోని ప్రతి ఒక్క మెగా హీరో బయటికి వచ్చి వైష్ణవ తేజ్ ని అప్రిషియేట్ చేసినా.. అల్లు అర్జున్ నుండి ఎలాంటి స్పందన లేదు. అంతేకాదు దర్శకుడు సుకుమార్ ఇంట్లో జరిగిన సుకుమార్ కూతురు హాఫ్ సారి ఫంక్షన్ కి.. దర్శకుడు సుకుమార్ కూడా కేరళ లో పుష్ప షూటింగ్ లో బిజీగా ఉన్నా కూడా సుకుమార్ అప్పటికి అప్పుడు వచ్చి వెళ్ళాడు.
అదే ఫంక్షన్ కి తారక్, మహేష్ లాంటి హీరోలు ఫ్యామిలీ తో కలిసి అటెండ్ అయ్యారు. కానీ సుకుమార్ ఫంక్షన్ కి కూడా అల్లు అర్జున్ రాలేదు. అదే టైం లో అల్లు అర్జున్ ఫ్యామిలీతో పాటు దుబాయ్ లో దర్శనమిచ్చాడు. తన పిల్లలు అయాన్, అర్హ, భార్య స్నేహ తో దుబాయ్ లో ఎంజాయ్ చేస్తున్నాడు. అయితే మార్చి 19 న రిలీజ్ కాబోతున్న చావుకబురు చల్లగా సినిమా ఈవెంట్ కి ఆలు అర్జున్ రాబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. తనకెంతో ఇష్టమైన ప్రియ మిత్రుడు అయిన బన్నివాస్ ఆధ్వర్యంలో తెరకెక్కిన చావుకబురు చల్లగా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి అల్లు అర్జున్ రాబోతున్నట్టుగా తెలుస్తుంది. దీనికి గనక అల్లు అర్జున్ అటెండ్ అయితే ఇప్పటికే గుర్రుగా ఉన్న మెగా ఫాన్స్ సోషల్ మీడియాలో రచ్చ చెయ్యడం ఖాయం. మరి అల్లు అర్జున్ చావు కబురు చల్లగా ఈవెంట్ కి వస్తాడా? రాడా ? అనేది ఇప్పుడు సూపర్ సస్పెన్స్ గా మారింది.