Advertisementt

2022 ఏప్రిల్ ని టార్గెట్ చేసిన ప్రభాస్ సలార్

Sun 28th Feb 2021 03:42 PM
prabhas,shruti haasan,salaar pan india film,salaar to release april 14th 2022,prabhas salaar,prashanth neel director,prabhas- prashanth neel salaar movie  2022 ఏప్రిల్ ని టార్గెట్ చేసిన ప్రభాస్ సలార్
Prabhas Salaar to release April 14th 2022 2022 ఏప్రిల్ ని టార్గెట్ చేసిన ప్రభాస్ సలార్
Advertisement
Ads by CJ

ప్రభాస్ పాన్ ఇండియా ఫిలిమ్స్ లిస్ట్ గురించి ఎప్పటికప్పుడు ముచ్చటించుకుంటూనే ఉన్నాం. ప్రభాస్ - రాధాకృష్ణ పాన్ ఇండియా ఫిలిం రాధేశ్యామ్ జులై 30 న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. తర్వాత ప్రభాస్ ఆదిపురుష్ రిలీజ్ ఉంటుందా? లేదంటే సలార్ రిలీజ్ ఉంటుందా? అనుకునేలోపు ప్రభాస్ సలార్ డేట్ ప్రకటించబోతున్నట్టుగా సలార్ టీం ప్రకటన ఇచ్చింది. ఓం రౌత్ ఆదిపురుష్ లేట్ అయిన సలార్ కి డేట్ ఇచ్చేందుకు ప్రశాంత్ నీల్ రెడీ అయ్యారు. ఇప్పటికే గోదావరి ఖని బొగ్గు గనుల్లో సలార్ ఫస్ట్ షెడ్యూల్ ని పూర్తి చేసింది సలార్ టీం. తర్వాత కెజిఎఫ్ పోస్ట్ ప్రొడక్షన్స్ పనుల్లో ప్రశాంత్ నీల్ బిజీ అయ్యారు. ఈలోపు ప్రభాస్ ఆదిపురుష్ ట్రైనింగ్ కోసం ముంబై వెళ్లారు.

అయితే తాజాగా సలార్ డేట్ ఇస్తున్నామంటూ ఊరించేసరికి.. ప్రభాస్ ఫాన్స్ సోషల్ మీడియాలో అలెర్ట్ అయ్యారు. సలార్ డేట్ ఇవ్వబోతున్నాం అన్న దగ్గరనుండి సలార్ ని సోషల్ మీడియా లో ట్రేండింగ్ లో నిలిపారు. ఇక సలార్ డేట్ ని కొద్దీ నిమిషాల ముందే సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది టీం. ప్రభాస్ సలార్ పాన్ ఇండియా ఫిలిం వరల్డ్ వైడ్ గా ఏప్రిల్ 14, 2022 న రిలీజ్ చెయ్యబోతున్నట్టుగా ప్రకటించారు. మరి 2022 సంక్రాంతికి మహేష్ బాబు - పవన్ కళ్యాణ్ ఫైట్ కి రెడీ కాగా.. ఇప్పుడు ప్రభాస్ ముందుగా 2022 లో తన పాన్ ఇండియా ఫిలిం డేట్ ని ఖరారు చేసి ప్రకటించారు. ప్రభాస్ - ప్రశాంత్ నీల్ కలిసి ఏప్రిల్ 14, 2022 న బాక్సాఫీసు షేక్ చెయ్యడానికి రాబోతున్నారు.

Prabhas Salaar to release April 14th 2022:

Prabhas -Shruti Haasan Salaar to release April 14th 2022

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ