Advertisementt

2022 సంక్రాంతి కి రసవత్తర పోరు

Mon 01st Mar 2021 12:59 PM
pawan kalyan,mahesh babu,balakrishna,pawan - krish movie,mahesh sarkaru vaari paata movie,balakrishna - gopichand malineni movie,2022 sankranthi,biggest clash  2022 సంక్రాంతి కి రసవత్తర పోరు
Pawan Kalyan, Mahesh Babu, Balakrishna In Sankranthi Race 2022 సంక్రాంతి కి రసవత్తర పోరు
Advertisement
Ads by CJ

గత ఏడాది కరోనా క్రైసిస్ వలన సినిమాలన్నీ వాయిదాల మీద వాయిదాలు పడ్డాయి. కొన్ని ఓటిటికి వెళ్లాయి.. కొన్ని థియేటర్స్ కోసం వెయిట్ చేసాయి. ఇక థియేటర్స్ ఓపెన్ అవ్వడమే వారానికో సినిమా చొప్పున ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్నాయి. సంక్రాంతి దగ్గరనుండి ప్రతి వారం గ్యాప్ లేకుండా సినిమాల మీద సినిమాలు విడుదలవుతూనే ఉన్నాయి. మరి కొన్ని రిలీజ్ డేట్స్ ప్రకటించాయి. మార్చి, ఏప్రిల్, మే, జూన్, జులై, ఆగష్టు, సెప్టెంబర్, అక్టోబర్ దసరా వరకు ప్రతి వారం సినిమాలు రిలీజ్ డేట్స్ఉన్నాయి. అందులో ప్రతి నెల ఓ భారీ బడ్జెట్ మూవీ విడుదలకు సిద్దమవుతుంది. ఇక వచ్చే ఏడాది సంక్రాంతికి కొన్ని సినిమాల రిలీజ్ డేట్స్ ఇప్పటినుండే ఇచ్చేస్తున్నాయి. అందులో ముందుగా మహేష్ బాబు సర్కారు వారి పాట రిలీజ్ 2022 జనవరి అంటే సంక్రాంతికి రిలీజ్ అంటూ డేట్ ఇచ్చేసారు. 

రీసెంట్ గా పవన్ కళ్యాణ్ - క్రిష్ కాంబో PSPK27 మూవీ ని 2022 సంక్రాంతికి విడుదల అంటూ రిలీజ్ డేట్ ప్రకటించి సంక్రాంతికి రసవత్తర పోరుకి తెర లేపారు. పవన్ vs మహేష్ అన్నట్టుగా. ఇక ఇప్పుడు తాజాగా బాలయ్య కూడా 2022 సంక్రాంతి బరిలో నిలవబోతున్నట్లుగా టాక్ వినిపిస్తుంది. బాలకృష్ణ - బోయపాటి BB3 మే 28 న రిలీజ్ డేట్ ప్రకటించారు. ఇప్పుడు గోపీచంద్ మలినేని తో బాలయ్య బాబు చెయ్యబోయే మాస్ ఎంటర్టైనర్ కూడా 2022 సంక్రాతి రేస్ లోకి రాబోతున్నట్టుగా తెలుస్తుంది. ఈ సంక్రాంతికి క్రాక్ తో మాస్ హిట్ కొట్టిన దర్శకుడు గోపీచంద్ మలినేని, బాలయ్య తో తియ్యబోయే పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ ని 2022 సంక్రాంతికి విడుదల చేసి హిట్ కొట్టాలనే కసితో ఉన్నట్లుగా అనిపిస్తుంది.

Pawan Kalyan, Mahesh Babu, Balakrishna In Sankranthi Race:

Pawan Vs Mahesh Vs Balakrishna: Biggest Clash!

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ