Advertisementt

వెంకీ దృశ్యం 2 స్టార్ట్ చేసేసారు

Mon 01st Mar 2021 08:33 PM
venkatesh,drishyam 2 movie,venkatesh drishyam 2,venkatesh drishyam 2 started,jeethu josef,anup rubens,suresh babu  వెంకీ దృశ్యం 2 స్టార్ట్ చేసేసారు
Drishyam 2 Started వెంకీ దృశ్యం 2 స్టార్ట్ చేసేసారు
Advertisement
Ads by CJ

మలయాళంలో మోహన్ లాల్ - జీతూ జోసెఫ్ కాంబోలో తెరకెక్కిన దృశ్యం 2 ఓటిటిలో విడుదలై సూపర్ హిట్ అయ్యింది. మోహన్ లాల్ నటన, జీతూ జోసెఫ్ మేకింగ్, కాన్సెప్ట్ అన్ని దృశ్యం 2 హిట్ లో భాగం పంచుకున్నాయి. గతంలో దృశ్యం సినిమా హిట్ అవడంతో ఆ చిత్రాన్ని పలు భాషల్లో రీమేక్ చేసిన విషయం తెలిసిందే. అయితే అప్పట్లో దృశ్యం 2 కోసం ఆయా భాషలు హీరోలు తొందర పడినా.. ఇప్పుడు దృశ్యం 2 కి మాత్రం కేవలం టాలీవుడ్ సీనియర్ వెంకటేష్ ముందుగా తొందర పడ్డాడు. దృశ్యం 2 ఓటిటిలోకి రావడం రావడమే దృశ్యం 2 రీమేక్ రైట్స్ దక్కించుకున్నాడు. అంతేకాదు ఏకంగా దృశ్యం 2 ఒరిజినల్ దర్శకుడు జీతూ జోసెఫ్ నే ఈసారి తెలుగు రీమేక్ కి రంగం లోకి దింపుతున్న విషయం తెలిసిందే. 

తెలుగులో దృశ్యం సినిమా వెంకటేష్ - మీనా కలయికలో శ్రీప్రియ దర్శకత్వంలో తెరకెక్కి మంచి హిట్ అయ్యింది. ఇక తాజాగా దృశ్యం 2 కి జీతూ జోసెఫ్ దర్శకుడిగా అనూప్ రూబెన్స్ సంగీత దర్శకుడిగా.. వెంకటేష్ హీరోగా, సురేష్ బాబు నిర్మాతగా నేడు పూజ కార్యక్రమాలతో లాంఛనంగా మొలలు పెట్టారు. మార్చి 5 నుండి దృశ్యం 2 రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు.  వెంకటేష్, జీతూ జోసెఫ్, అనూప్ రూబెన్స్, సురేష్ బాబు పూజ కార్యక్రమాలతో దృశ్యం 2 తెలుగు రీమేక్ అధికారికంగా పట్టాలెక్కినట్టుగా పిక్ తో ప్రకటించింది దృశ్యం 2 తెలుగు రీమేక్ 2 టీం. 

Drishyam 2 Started:

Venkatesh Drishyam 2 Started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ