పుష్ప సినిమా షూటింగ్ కి తప్ప అల్లు అర్జున్ బయట ఫంక్షన్స్ లో పెద్దగా కనిపించడం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్, మహేష్, పవన్ కళ్యాణ్, చిరు ఇలా అంతా ఏదో ఒక ఈవెంట్ అంటే.. ఉప్పెన సాంగ్ లాంచ్, ఉప్పెన టీజర్ లాంచ్, నాంది టీజర్ లాంచ్ లో మహేష్ ఇలా అందరూ ఏదో ఒకసారి ఫోటో గ్రాఫర్ కి దొరికినా అల్లు అర్జున్ మాత్రం బయట దొరకడం లేదు. అయితే తాజాగా గీత ఆర్ట్స్ బ్యానర్ నుండి బయటికి రాబోతున్న చావు కబురు చల్లగా ఈవెంట్ కి మనం ముందు చెప్పుకున్నట్టుగానే అల్లు అర్జున్ స్పెషల్ గెస్ట్ గా రాబోతున్నట్టుగా చావు కబురు టీం ఓ వీడియోతో సస్పెన్స్ క్రియేట్ చేస్తుంది.
కార్తికేయ జిమ్ చేస్తూ ఉండగా.. గీత ఆర్ట్స్ నుండి ఫోన్ రావడం.. అవునా నిజంగా వస్తున్నారా? కన్ఫర్మ్ ఆ? అంటూ ఎగ్జైట్ అవుతుంటే.. లావణ్య త్రిపాఠి ఫోన్ లిఫ్ట్ చేసి నిజంగా వస్తున్నారా అంటూ మొహం చాటంత చేసి మరీ అడుగుతుంది. కమెడియన్స్ భద్రం, మహేష్.. అవునా ఆయన వస్తున్నారా? ఎలా ఒప్పుకున్నారు? అవును ఫాన్స్ కోసం ఏమైనా చేస్తారులే. వస్తున్నాడు కదా అంటే.. కార్తికేయ అర్జెంట్ గా ఈ విషయం అందరితో.. ఆ ఇప్పుడే కాదు చిన్న సస్పెన్స్. ఆల్రెడీ సినిమా బ్లాక్ బస్టర్ అయినంత హ్యాపీగా ఉంది. ప్రస్తుతానికి సస్పెన్స్ అంటూ కార్తికేయ చెప్పడంతో.. గెస్ చెయ్యండి అంటూ సస్పెన్స్ క్రియేట్ చేసింది చావు కబురు చల్లగా టీం. మరి ఆ గెస్సింగ్ స్టార్ ఎవరో మీకు ఈపాటికి అర్ధమై ఉండాలి. అదే మరి స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్. మరి ఇప్పటివరకు బయటికి రాని అల్లు అర్జున్ చాలా రోజుల తర్వాత బయటికి వస్తున్నాడంటే ఆయన ఫాన్స్ రచ్చ చేసినా.. మెగా ఫాన్స్ మాత్రం గుర్రుగా ఉండడం ఖాయమే. ఎందుకంటే మెగా హీరో వైష్ణవ తేజ్ విషయంలో అల్లు అర్జున్ చేసిన పని మెగా ఫాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.